LK Advani : బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీకి మరోసారి అనారోగ్యం

అటల్బిహారి వాజపేయ్ ప్రభుత్వంలో ఎల్‌కెే అద్వానీ కీలకంగా వ్యవహరించారు...

LK Advani : భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ హోం శాఖ మంత్రి ఎల్‌కెే అద్వానీ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి కుటుంబ సభ్యులు.. ఆయన్ని తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన్ని ఉంచారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. 97 సంవత్సరాల అద్వానీ(LK Advani) వయస్సు రీత్య ఇటీవల పలుమార్లు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో ఆయన్ని పలుమార్లు మధుర రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు తరలించిన విషయం విధితమే.

LK Advani Health Updates

అటల్బిహారి వాజపేయ్ ప్రభుత్వంలో ఎల్‌కెే అద్వానీ కీలకంగా వ్యవహరించారు. 2002 నుంచి 2004 వరకు దేశానికి ఉప ప్రధానిగా ఆయన పని చేశారు. అలాగే 1999 నుంచి 2004 వరకు కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్నారు. బీజేపీ ఏర్పాటులో అద్వానీ అత్యంత కీలకంగా వ్యవహరించారు. అయితే 2014 నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది.. ఎల్‌కెే అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది. దీంతో ఈ ఏడాది మార్చిలో దేశ అత్యున్నత పురస్కారాన్ని అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. మరోవైపు గతంలో ఎల్‌కెే అద్వానీ అనారోగ్యంపై సమాచారం అందుకున్న ప్రధాని మోదీ.. ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన విషయం విధితమే. భారత దేశ విభజనకు ముందు.. ప్రస్తుత పాకిస్థాన్‌లోని కరాచీలో ఎల్‌కెే అద్వానీ జన్మించిన సంగతి తెలిసిందే.

Also Read : Allu Arjun Arrest : హీరో అల్లు అర్జున్ కేసులో మరో కొత్త ట్విస్ట్

Leave A Reply

Your Email Id will not be published!