KTR : లాయడ్స్ గ్రూప్ టెక్నాలజీ సెంటర్ – కేటీఆర్
ప్రపంచంలో అతి పెద్ద బ్యాంకింగ్ గ్రూప్
KTR : ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీలు ఇప్పుడు హైదరాబాద్ ను ఎంచుకుంటున్నాయి. ఇప్పటికే యువ నాయకుడు కేటీఆర్ సారథ్యంలో పలుమార్లు ఇంగ్లండ్, అమెరికా , ఇతర దేశాలకు వెళ్లి వచ్చారు. ఇక్కడ కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలకు వెసులుబాటు కల్పిస్తోంది.
అవసరమైన మేరకు మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా దిగ్గజ కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్ లో కొలువు తీరాయి. తాజాగా మరో దిగ్గజ కంపెనీ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం విశేషం.
దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు రాష్ట్ర ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR). ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. 2.6 కోట్లకు పైగా కస్టమర్లతో రిటైల్, వాణిజ్య విభాగాల్లో యుకె కు చెందిన అతి పెద్ద ఆర్థిక సేవల ప్రదాత అయిన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్ లో టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇందుకు సంబంధించి సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు పరిశ్రమల కార్యదర్శి జయేష్ రంజన్ కూడా పాల్గొన్నారు. యుకె, యుఎస్ఏ టూర్ సందర్భంగా మే 3న లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ తో సమావేశం కావడం జరిగిందని తెలిపారు కేటీఆర్. చాలా తక్కువ సమయంలోనే సదరు కంపెనీ హైదరాబాద్ ను ఎంచుకుందని స్పష్టం చేశారు. మొదటి ఆరు నెలల్లో 600 మందిని నియమించుకుంటుందని తెలిపారు మంత్రి.
Also Read : YS Sharmila KTR : ఖాకీలు లేకుండా కేటీఆర్ రాగలవా – షర్మిల