Lockie Ferguson : లాకీ ఫెర్గూస‌న్ సెన్సేష‌న్

రాజ‌స్థాన్ ను క‌ట్ట‌డి చేసిన బౌల‌ర్

Lockie Ferguson  : ఎవ‌రీ లాకీ ఫెర్గూస‌న్ అని అనుకుంటున్నారా. న్యూజిలాండ్ కు చెందిన స్టార్ పేస‌ర్. అంతే కాదు ప్ర‌పంచ క్రికెట్ లో టాప్ మోస్ట్ పేస‌ర్ల‌లో ఫెర్గూస‌న్ ఒక‌డు. గుజ‌రాత్ టైటాన్స్ ఏరికోరి ఎంచుకుంది ఈ బౌల‌ర్ ను.

అంతే కాదు అవ‌స‌ర‌మైన‌ప్పుడు బంతుల్ని బాద‌గ‌లడు కూడా. త‌న స‌త్తా ఏమిటో. త‌న చేతిలోని బంతికి ఉన్న ప‌వ‌ర్ ఏంటో ఐపీఎల్ 2022లో చూపించాడు.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో ముంబై వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లోi త‌న జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఓ వైపు ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ ఆల్ రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంటే లాకీ ఫెర్గూస‌న్(Lockie Ferguson )మాత్రం త‌న‌దైన శైలిలో స‌త్తా చాటాడు.

రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. బంతుల్ని ఎడా పెడా బాదుతూ ఫోర్లు, సిక్సర్ల మోత మోగిస్తున్న స్టార్ హిట్ట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ ను అద్భుత‌మైన బాల్ తో పెవిలియ‌న్ కు పంపించాడు.

ఒక వేళ బ‌ట్ల‌ర్ ఇంకా కొద్ది సేపు క్రీజులో గ‌నుక ఉండి ఉంటే రాజ‌స్థాన్ గెలిచేది. గుజ‌రాత్ కు నిరాశే మిగిలేది. ఈ మ్యాచ్ లో లాకీ ఫెర్గూస‌న్ నాలుగు ఓవ‌ర్లు వేసి మూడు కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఇక గుజ‌రాత్ త‌ర‌పున ఆడిన మ‌రో బౌల‌ర్ య‌ష్ ద‌యాల్ తానేమిటో నిరూపించాడు. అద్భుత‌మైన స్పెల్ తో ప్ర‌త్య‌ర్థుల ఆట క‌ట్టించాడు.

ఇత‌డు కూడా మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మొత్తంగా లాకీ ఫెర్గూస‌న్ బౌలింగ్ ను చూసి తీరాల్సిందే.

Also Read : గుజ‌రాత్ భ‌ళా రాజ‌స్థాన్ విల‌విల

Leave A Reply

Your Email Id will not be published!