Lok Sabha Deputy Speaker: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవి ఎన్డీయేకే ?

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవి ఎన్డీయేకే ?

Lok Sabha Deputy Speaker: 18వ లోక్‌సభ స్పీకర్‌ గా ఓం బిర్లా మరోసారి ఎన్నికయ్యారు. అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ పదవికి ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఓం బిర్లా విజయం సాధించారు. కాగా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్‌ పదవినీ కూడా తమ కూటమి ఎంపీకే ఇవ్వాలని మోదీ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం.

Lok Sabha Deputy Speaker….

వాస్తవానికి ఈ డిప్యూటీ స్పీకర్ పదవి కారణంగానే స్పీకర్‌ పదవిని ఎన్నిక అనివార్యమైంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో లోక్‌సభ(Lok Sabha)లో తమ బలాన్ని పెంచుకున్న విపక్ష ఇండియా కూటమి… డిప్యూటీ స్పీకర్‌ పదవికి పట్టుబట్టింది. ఉపసభాపతి పదవి తమకు ఇస్తే… స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం చేస్తామని ప్రతిపక్షాలు కండీషన్‌ పెట్టాయి. ఇందుకు ఎన్డీయే కూటమి నిరాకరించింది. అయితే, ఇప్పుడు బీజేపీ లేదా దాని మిత్రపక్షాలకు చెందిన నేతనే ఉప సభాపతిగా ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఆ ఎంపీ ఎవరనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డిప్యూటీ స్పీకర్‌ పదవికీ విపక్షాలు పోటీపడితే… అప్పుడు కూడా ఎన్నిక నిర్వహిస్తారు.

2014లో మోదీ సర్కారు ఎన్నికైన తర్వాత సుమిత్రా మహజన్‌ స్పీకర్‌గా వ్యవహరించగా… అన్నాడీఎంకేకు చెందిన తంబిదొరై ఉపసభాపతి పదవి చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఎన్డీయే రెండోసారి విజయం సాధించిన డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఖాళీగా ఉంచారు. ఈసారి ఎన్డీయే మిత్రపక్షాలకు ఆ పదవిని కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Also Read : Bridge Collapse: బిహార్‌లో కుంగిన వంతెన ! పది రోజుల వ్యవధిలో నాల్గో ఘటన !

Leave A Reply

Your Email Id will not be published!