Lok Sabha Polling: తొలి దశలో 65.5 శాతం పోలింగ్ నమోదు !
తొలి దశలో 65.5 శాతం పోలింగ్ నమోదు !
Lok Sabha Polling: సార్వత్రిక ఎన్నికలు-2024 కు సంబంధించిన తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి విడతలో అత్యధికంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ స్థానాలకతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం శాసన సభ స్ధానాలకు గాను శుక్రవారం పోలింగ్ జరిగింది. శనివారం అందిన తాజా గణాంకాల ప్రకారం లోక్ సభ ఎన్నికల తొలి దశలో 65.5 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పోలింగ్ గణాంకాలను కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Lok Sabha Polling Updates
2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశలోనే ఎక్కువ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈసారి ఎక్కువగానే పోలింగ్ శాతం నమోదైందని ఈసీ ఇప్పటికే తెలిపింది. 2019లో ఇవే స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 69.43 శాతం పోలింగ్ నమోదైంది. ఆనాడు 91 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఎన్నికల సంఘం ఆదివారం తుది గణాంకాలు వెల్లడించే అవకాశం ఉంది.
Also Read : Big Snake Vasuki: గుజరాత్ లో లభ్యమైన ప్రపంచంలో అతి పెద్ద సర్పం వాసుకి శిలాజాలు !