Lokesh Kanagaraj : ‘లోకేష క‌మ‌ల్’ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్

దుమ్ము రేపుతున్న విక్ర‌మ్ మూవీ

Lokesh Kanagaraj : లోకేష్ క‌న‌గ‌రాజ్ మోస్ట్ పాపుల‌ర్ డైరెక్ట‌ర్. కోలీవుడ్ లో వెరీ వెరీ స్పెష‌ల్. లోకేష్ క‌న‌గ‌రాజ్(Lokesh Kanagaraj) మూవీ మేకింగ్ చాలా భిన్నంగా ఉంటుంది ఇత‌ర ద‌ర్శ‌కుల కంటే. అందుకే అత‌డు సినిమాల‌ను జ‌యాప‌జ‌యాల గురించి ప‌ట్టించుకోరు.

తాజాగా ప్ర‌ముఖ దిగ్గ‌జ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ , విజ‌య్ సేతుప‌తి, ఫ‌హ‌ద్ ఫాసిల్ క‌లిసి తీసిన విక్ర‌మ్ మూవీ దుమ్ము రేపుతోంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు లోకేష్ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రుగుతుండ‌గా తీసిన ఫోటో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప్ర‌స్తుతం అది వైర‌ల్ గా మారింది.

త‌మిళ భాషా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తీశాడు లోకేష్ క‌న‌గ‌రాజ్(Lokesh Kanagaraj) విక్ర‌మ్ మూవీని. తానే రాసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు . రాజ్ క‌మ‌ల్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ నిర్మించింది దీనిని.

క‌మ‌ల్ తో పాటు కాళిదాస్ జ‌య‌రామ్ , న‌రేన్, ఆంటోనీ వ‌ర్గీస్ , అర్జున్ దాస్ స‌హాయ‌క పాత్ర‌ల్లో న‌టించారు. సౌండ్ ట్రాక్ , ఫిల్మ్ స్కోర్ ని సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ కంపోజ్ చేశారు.

సినిమాటోగ్ర‌ఫీ గంగాధ‌ర‌న్ , ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ చేసిన ట్రైల‌ర్ భారీ ఆద‌ర‌ణ చూర‌గొంది. ప్ర‌పంచ వ్యాప్తంగా శుక్ర‌వారం విక్ర‌మ్ మూవీని విడుద‌ల చేశారు.

మంచి స్పంద‌న వ‌స్తోంది ఆశించిన దానికంటే ఎక్కువ‌గా. విక్ర‌మ్ 2021 జూలై 16న ప్రారంభ‌మైంది. ఈ చిత్రం ఇద్ద‌రు తోబుట్టువుల చుట్టూ తిరుగుతుంది.

ఒక‌రు గ్యాంగ్ స్ట‌ర్ మ‌రొక‌రు రాజ‌కీయ నాయ‌కుడు. వారిద్ద‌రూ క‌లిసి ఉన్న‌త స్థాయి ప్ర‌భుత్వ అధికారిని కిడ్నాప్ చేసి బంధిస్తారు.

Also Read : న‌ష్ట ప‌రిహారం చెల్లించ‌లేం – అంబ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!