#LoveAndRomance : ప్రేమ పండాలంటే రొమాన్స్ వుండాల్సిందే

Love and Romance : లోకాన్ని ఆవిష్కరించే దారుల్లో ప్రేమ ఒకటవుతే, మరొకటి రొమాన్స్. రెండూ లేకపోతే జీవితం బోర్ కొడుతుంది.ప్రేమ అంటే రెండు గుండెల చప్పుడు. రెండు మనస్సుల మధ్య సాగే సంభాషణ. దానితో అనుసంధానమై పోతే హృదయం పిల్ల కాలువై పరుగులు తీస్తుంది. ఆ కళ్ళల్లో మెరుపు. ఆ కనుల కలనుల్లో సాగే కలల కలబోతలు. ఓహ్ చెప్పుకుంటూ పోతే జీవితం సరి పోదు. మరో జన్మ కావాలి.

అది చెరిగి పోకుండా ఉంటే, లైఫ్ మరింత గొప్పగా అనిపిస్తుంది. ప్రతి క్షణం కళ్ళలోకి చూసు కోవడం, తెలియకుండా తాకడం కూడా ఎనలేని అనుభవం తోడవుతుంది. ఇది మరిచిపోలేని విధంగా నిత్యం కలిపేలా చేస్తుంది. అందుకే జీవితంలో కోల్పోయినవన్న్నీ సినిమాల్లో దర్శనమిస్తూ ఉంటాయి. ఇద్దరి మధ్యన ప్రేమ అన్నదే లేకపోతే జీవితం నరకమవుతుంది. లోకం నుంచి వెళ్లి పోవాలని అనిపిస్తుంది. ప్రేమ అన్నది కొందరిని చితి నుంచి బతికేలా చేస్తే, మరికొందరి హృదయాల మీద చెరగని రొమాంటిక్ ముద్ర వేస్తుంది. ఇద్దరి మధ్య బంధం శాశ్వతమే కానక్కర్లేదు, కానీ నమ్మకం అనే పునాదుల మీద పెనవేసుకుంటూ పోయేందుకు, నిరంతరం ప్రయత్నం చేస్తూ వుండాల్సిందే. లేకపోతే మన మీద మనకే బోర్ కొడుతుంది.

Most Women Think Love And Sex Should Go Together; Is It More Fulfilling  Than A One-Night Stand?

కల్మషం లేని ప్రేమను పొందడం అదృష్టం. ఎలాంటి అవసరం లేకుండా రొమాంటిక్ గా ఉండటం చాలా కష్టం. ప్రేమ తన పరిమితులను దాటినప్పుడు కొంచం కష్టమవుతుంది. ప్రేమలో ఎంతగా పెనవేసుకోగలిగితే, బతుకు రాగమవుతుంది. ఏళ్ళ తరబడి పాడుకునే పాటవుతుంది. ప్రేమలో మాటలుండవు. గుండెల్లో అనుభూతులు మాత్రమే ఉంటాయి. అందుకే రొమాన్స్ అన్నది కొద్దీ సేపే. అది కదలిక ఉన్నంత వరకే. కానీ ప్రేమలో మాత్రం అలాంటివేవీ ఉండవు. ఒకరి కోసం ఇంకొకరు వేచి చూడటం. నువ్వు లేకుండా నేనుండలేను అన్న స్థితికి చేరు కోవడం. ప్రేమ బతుకును వెలిగించే దీపం అవుతే , రొమాన్స్ అన్నది గుండెల్ని కలిపే శ్వాస. ఇదే రెండింటి మధ్యన నిరంతరం జరిగే ఆరాటం .. సో..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కదూ..!

No comment allowed please