Lovers Day Comment : ప్రేమించనీ..పల్లవించనీ..పరవశించనీ
ప్రేమికుల దినం కలకాలం
Lovers Day Comment : ప్రతి కథకు ముగింపు ఉంటుంది. ప్రతి జీవితానికి ఓ కథ ఉంటుంది. గుండె లోతుల్లో ప్రేమ ప్రవాహమై అల్లుకు పోతుంది. అదో భావన..అదో అద్వితీయమైన ఆనందపు ఆవాహన. ప్రేమకు పర్యాయ పదం ఏదైనా ఉందా అంటే ఎన్నో..ప్రేమ..కాదల్ ..ఇష్క్..లవ్ ..ఎవరికి వారు తమకు ఇష్టమైన రీతిలో పిలుచుకుంటున్న వాళ్లే.
కులం, మతం, ప్రాంతం..ప్రపంచం ..దేనికీ అందనిది..ఎవరికీ చెందనిది..అందరికీ ఇష్టమైనది..ముఖ్యమైనది..లోకాన్ని ద్విగుణీకృతం చేస్తున్నది ప్రేమే(Lovers Day Comment).
గుండెలలో కదలాడే స్పందనలు కొందరికే అర్థం అవుతాయి. ఇంకొందరిని మైమరిపించేలా చేస్తాయి. అదంతే ప్రేమ మనిషిని బతికిస్తుంది..కాదంటే చంపేస్తుంది కూడా. చితి నుంచి బతికించక పోవచ్చు..కానీ ప్రేమ ఎల్లప్పటికీ జీవించేలా చేస్తుంది. ప్రేమ అదో అనిర్వచనీయమైన ఆనందం. అదో అద్భుత విశ్వ వ్యాప్త గీతం.
ఎన్నో కథలు..మరెన్నో గీతాలు..ఇంకెన్నో పద్యాలు..కవితలు..కథలు..నాటకాలు.. ఇలా ప్రతిదీ ప్రేమమయం అయిపోయింది. కాలం మారింది..తరం మారింది..లోకం మారింది..కానీ ప్రేమ మారలేదు. కొత్త పోకడలు వచ్చినా..మనుషుల మధ్య రాగ బంధాలు , ఆత్మీయతా అనురాగాలు అన్నింటికీ ప్రేమ బంధమై అల్లుకు పోయేలా చేస్తోంది.
ప్రేమ లేదంటే నమ్మలేం. ప్రేమ లేకుండా ఉండలేం అంటే చెప్పలేం(Lovers Day Comment). ఎందుకంటే ఈ ప్రపంచం నడుస్తోందంటే కాసింత ప్రేమ ఉండబట్టే..ప్రేమ రక్తమై చేరి పోతుంది..చేతి కర్రై నిలబెడుతుంది.
ప్రేమంటే ఆలింగనం మాత్రమేనా కాదు నీకు నేనున్నానంటూ భావన..ఓ భరోసా..ఓ లాలన..ఓ చల్లని చూపు..ఓ సుతిమెత్తని కౌగిలింత. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకుంటున్న వాళ్లు ఎందరో ..ప్రేమ కోసం ప్రాణం పెట్టే వాళ్లు మరెందరో..ప్రేమ ఎవరినీ ఇవ్వమని అడగదు..బతికేందుకు కావాల్సిన నమ్మకాన్ని ఇస్తుంది.
విజయం వరించేలా చేస్తుంది. కష్టంలో తోడుగా నిలుస్తుంది..కన్నీళ్లను తుడుస్తుంది..ప్రేమ.. ప్రేమంటే మధురం..సుమధురం..ఉత్తుంగ తరంగం..సాగర సంగమం..నింగిని..నేలను..అన్నింటిని కలిపేది ప్రేమ ఒక్కటే..నువ్వు నాకు నీకు నేను అన్న ప్రేమైక భావనను పెంపొందించేది కూడా ప్రేమే.
ప్రేమంటే ఏమిటంటే ఏం చెప్పగలం..ఎంత చెప్పినా తనివి తీరదు..ప్రేమ..ప్రేమకు మరణం లేదు..ప్రేమ శాశ్వతమైనది..అంతకు మించిన ఆనందకరమైనది..ప్రేమికుల్ని కలిపేది..మైమరిచి పోయేలా చేసేది..బంధాన్ని బలోపేతం చేసేది ప్రేమ..
ప్రేమ లోకం ఉన్నంత దాకా బతికే ఉంటుంది..బతికించేలా చేస్తుంది. ప్రేమకు ఒక రోజు ఏమిటి..అన్ని రోజులు ప్రేమికుల రోజులే..అందుకే తనివితీరా ప్రేమించాలి..శ్వాసించాలి..ప్రేమతనపు లోగిళ్లలో సేద దీరాలి. ప్రేమా కవ్వించనీ ప్రేమా స్పృశించనీ..ప్రేమ కలకాలం వర్దిల్లనీ.
Also Read : స్మృతి మంధాన అందంలో థిల్లాన