MI vs LSG IPL 2022 : శ‌త‌క్కొట్టిన రాహుల్ ల‌క్నో బిగ్ స్కోర్

ముంబై ఇండియ‌న్స్ టార్గెట్ 200 ర‌న్స్

MI vs LSG : ఐపీఎల్ 2022లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దంచి కొట్టాడు. అజేయ శ‌త‌కంతో మెరిశాడు. కేవ‌లం 56 బంతులు ఆడిన రాహుల్ 9 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు.

దీంతో ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 199 ప‌రుగులు చేసింది. బ్ర‌బోర్న్ వేదిక‌గా ముంబై తో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ కేఎల్ రాహుల్ కు ఇది 100వ మ్యాచ్ కావ‌డం విశేషం.

రాహుల్ వ‌చ్చీ రావ‌డంతోనే దాడి చేయ‌డం మొద‌లు పెట్టాడు. ముంబై ఇండియ‌న్స్ (MI vs LSG)బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. ఇక ఉనాద్క‌త్ బౌలింగ్ లో రోహిత్ శ‌ర్మ క్యాచ్ ప‌ట్ట‌డంతో 10 ప‌రుగుల‌కే స్టోయినిస్ అవుట‌య్యాడు.

ధాటిగా ఆడిన మ‌నీశ్ పాండేను మురుగ‌న్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 29 బంతులు ఆడిన పాండే 38 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు ఉన్నాయి. క్వింట‌న్ డికాక్ వికెట్ ప‌డినా కేఎల్ రాహుల్ త‌న జోరు త‌గ్గించ‌లేదు.

కొట్టుకుంటూ పోయాడు. ధాటిగా ఆడ‌డం మొద‌లు పెట్టిన డికాక్ ను ఫేబియ‌న్ అలెన్ బోల్తా కొట్టించాడు. ఇక డికాక్ 13 బంతులు ఎదుర్కొని 24 ర‌న్స్ చేశాడు.

ఇందులో 4 ఫోర్లు ఓ సిక్స్ ఉంది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే రోహిత్ శ‌ర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇదిలా ఉండ‌గా ఈ మ్యాచ్ లో ఇరు జ‌ట్లు చెరో మార్పుతో మైదానంలోకి దిగాయి.

ల‌క్నో కృష్ణ‌ప్ప ప్లేస్ లో మ‌నీష్ పాండేను తీసుకుంది. ఇక ముంబై ఇండియ‌న్స్ బాసిల్ థంపిని త‌ప్పించి అలెన్ కు ఛాన్స్ ఇచ్చింది.

Also Read : ఐపీఎల్ టైటిల్ రేసులో ఆర్సీబీ

Leave A Reply

Your Email Id will not be published!