LSG vs CSK IPL 2023 : ల‌క్నో చెన్నై మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం

ర‌ద్దుకే మొగ్గు చూపిన అంపైర్లు

LSG vs CSK IPL 2023 :  ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో భాగంగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైయింది. ల‌క్నో(LSG vs CSK IPL 2023)  వేదిక‌గా ఈ మ్యాచ్ కొన‌సాగింది. ఈ సీజ‌న్ లో వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ను ర‌ద్దు చేయ‌క త‌ప్ప‌డం లేద‌ని అంపైర్లు నిర్ణ‌యించారు. దీంతో ల‌క్నో , చెన్నై జ‌ట్ల‌కు చెరి స‌మానంగా ఒక్కో పాయింట్ కేటాయించారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) టాస్ గెలిచాడు. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ధోనీ నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని తేలి పోయింది. బ‌రిలోకి దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 19.2 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 125 ర‌న్స్ చేసింది. ఇంకా 4 బాల్స్ వేయాల్సి ఉంది. ఈ త‌రుణంలో భారీగా వ‌ర్షం ప్రారంభ‌మైంది. ఎంత‌కూ త‌గ్గ‌క పోవడంతో గ‌త్యంత‌రం లేక మ్యాచ్ ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ల‌క్నోకు భారీ దెబ్బ త‌గిలింది. గ‌త మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయ‌ప‌డ్డ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ కు కూడా దూర‌మ‌య్యాడు. దీంతో అత‌డి స్థానంలో ల‌క్నో యాజ‌మాన్యం కృనాల్ పాండ్యాకు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

ఇక మ్యాచ్ ర‌ద్ద‌యినా ల‌క్నో చేసిన 125 ప‌రుగుల్లో ఆయుష్ బ‌దోనీ దుమ్ము రేపాడు. 33 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో రాణించాడు. 59 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక కృనాల్ పాండ్యా సున్నాకే ఔట్ కాగా, స్టోయినిస్ 6, క‌ర‌ణ్ శ‌ర్మ 9, కైల్ మేయ‌ర్స్ 14, వోహ్రా 14 ర‌న్స్ కే ప‌రిమిత‌మ‌య్యారు.

Also Read : ఎంఎస్ ధోనీ షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!