LSG vs PBKS IPL 2023 : పంజాబ్ రాణించేనా ల‌క్నో గెలిచేనా

ఇరు జ‌ట్ల‌కు కీల‌కం లీగ్ మ్యాచ్

LSG vs PBKS IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో మ‌రో కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. శ‌నివారం కేఎల్ రాహుల్ సార‌థ్యంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ , శిఖ‌ర్ ధావ‌న్ నేతృత్వ‌లోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ మ‌ధ్య మ్యాచ్ కొన‌సాగుతోంది. ఇర జ‌ట్లు హోరా హోరీగా త‌ల‌ప‌డ‌నున్నాయి. ఐపీఎల్ లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త ప‌రుగుల స్కోర్ జాబితాలో టాప్ లో కొన‌సాగుతున్నాడు పంజాబ్ స్కిప్ప‌ర్ ధావ‌న్.

ఇక ల‌క్నో సైతం అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో స‌త్తా చాటుతోంది. ఇరు జ‌ట్లు ఇప్ప‌టి దాకా లీగ్ లో 4 మ్యాచ్ లు ఆడాయి. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నాలుగింట్లో మూడు మ్యాచ్ లలో గెలిచి ఒక దానిలో ఓడి పోయింది. ఇక పంజాబ్ కింగ్స్(LSG vs PBKS IPL 2023) విష‌యానికి వ‌స్తే 4 మ్యాచ్ లు ఆడింది. 2 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించి 2 మ్యాచ్ ల‌లో ప‌రాజయం పాలైంది.

ఇరు జ‌ట్ల‌కు ఈ లీగ్ మ్యాచ్ అత్యంత కీల‌కం. పాయింట్ల ప‌ట్టిక‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టాప్ లో కొన‌సాగుతోంది. మెరుగైన ర‌న్ రేట్ కార‌ణంగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 2వ స్థానంతో స‌రి పెట్టుకుంది. ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ల‌క్నో కోచ్ గౌత‌మ్ గంభీర్ మాత్రం ఈ మ్యాచ్ గెలిచి తీరుతామ‌ని అంటున్నాడు. ఏ మాత్రం ఓట‌మి ఒప్పుకోని ఈ మాజీ క్రికెట‌ర్ త‌న జ‌ట్టుకు క‌ప్పు అందించాల‌నే ల‌క్ష్యంతో ఉన్నాడు.

Also Read : ఇక‌నైనా ఢిల్లీ బోణీ కొట్టేనా

Leave A Reply

Your Email Id will not be published!