LSG vs RCB : గత సీజన్ లో పేలవమైన ఆట తీరుతో నిరాశ పరిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(LSG vs RCB) ఈ ఏడాది ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 మెగా రిచ్ 15వ సెషన్ లో దుమ్ము రేపుతోంది.
అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ , ఫీల్డింగ్ తో ప్రత్యర్థి జట్లను కట్టడి చేస్తూ ముందుకు సాగుతోంది.
వరుస విజయాలతో ఊపు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ముంబై వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో 19 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.
ఏఎస్జీ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 181 పరుగులు చేసింది.
ఇక 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ బెంగళూరు(LSG vs RCB) బౌలర్ల దెబ్బకు చాప చుట్టేసింది.
ఎనిమిది వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది.
జట్టులో ముగ్గురు మాత్రమే మెరిశారు. కృనాల్ పాండ్యా ఒక్కడే 42 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
కెప్టెన్ కేఎల్ రాహుల్ 36, స్టోయినిస్ 24 పరుగులు చేశారంతే. మరోసారి మెరిశాడు హాజిల్ వుడ్.
లక్నో పతనాన్ని శాసించాడు. 4 వికెట్లు తీయగా హర్షల్ పటేల్ 2, సిరాజ్ , మ్యాక్స్ వెల్ చెరో వికెట్ తీశారు.
ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది.
ఈ తరుణలో కెప్టెన్ డుప్లెసిస్ అద్భుతంగా రాణించాడు. 96 పరుగులు చేసి కేవలం నాలుగు పరుగుల దూరంలో సెంచరీ చేయలేక పోయాడు.
మ్యాక్స్ వెల్ 23, షాబాజ్ అహ్మద్ 26 పరుగులు చేసి రాణించారు. లక్నో బౌలర్లలో చమీర, జాసన్ చెరో 2 వికెట్లు తీయగా పాండ్యా ఒక వికెట్ తీశాడు.
Also Read : కార్తీక్ ఎంట్రీకి వయసుతో పనేంటి