LSG vs RCB Eliminator : ఉత్కంఠ పోరులో ఎలిమినేట‌ర్ ఎవ‌రో

గెలిచిన జ‌ట్టు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో

LSG vs RCB Eliminator : గ‌త రెండు నెల‌లుగా నిర్వ‌హిస్తూ వ‌చ్చిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 చివ‌రి అంకానికి చేరింది. కేవ‌లం రెండు అడుగుల దూరంలో ఉంది టైటిల్ గెలిచేందుకు. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు జ‌ట్లు ప్లే ఆఫ్స్ కు చేరాయి.

ఇందులో క్వాలిఫయిర్ -1 లో గుజ‌రాత్ త‌న జైత్ర‌యాత్ర కంటిన్యూ చేసింది. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించి నేరుగా ఫైన‌ల్ కు చేరింది. ఈ కీల‌క పోరు ఆదివారం 29న గుజ‌రాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది.

ఇక ఆల్ రెడీ గుజ‌రాత్ తో ఏ జ‌ట్టు ఫైన‌ల్ ఆడుతుంద‌నేది ఉత్కంఠ నెల‌కొంది. శుక్ర‌వారం నాటికి గానీ క్లారిటీ రాదు. బుధ‌వారం ఎలిమినేట‌ర్ మ్యాచ్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(LSG vs RCB Eliminator) జ‌ట్ల మ‌ధ్య కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఈ మ్యాచ్ లో ఎవ‌రు గెలిస్తే వారు రాజ‌స్తాన్ తో ఆడ‌తారు. ఓడి పోయిన జ‌ట్టు నేరుగా ఇంటి బాట ప‌డుతుంది. కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్ మైదానంలో త‌ల‌ప‌డ‌నున్నాయి. రాత్రి ఏడున్న‌ర‌కు స్టార్ట్ అవుతుంది.

ల‌క్నో జ‌ట్టు బ‌లంగా క‌నిపిస్తోంది. కేఎల్ రాహుల్ కెప్టెన్ కాగా లూయిస్ , హుడా, పాండ్యా, స్టోయినిస్ , జేస‌న్ , గౌత‌మ్ , మోహిషిన్ ఖాన్ , ఆవేష్ ఖాన్ , బిష్ణోయ్ ఆడ‌తారు.

ఇక ఆర్సీబీ త‌ర‌పున డుప్లెసిస్ కెప్టెన్ కాగా పాటిదార్, మాక్స్ వెల్ , దినేష్ కార్తీక్ , లామ్రోర్ , షాబాజ్ , హ‌స‌రంగ‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్ , ఆకాశ్ దీప్ , సిద్దార్త్ కౌల్ , సిరాజ్ , హాజిల్ వుడ్ ఉన్నారు.

Also Read : గ‌తం మ‌రిచిపోను స‌క్సెస్ కు పొంగిపోను

Leave A Reply

Your Email Id will not be published!