LSG vs SRH IPL 2023 : హైద‌రాబాద్ ప‌రాజ‌యం ప‌రిస‌మాప్తం

కోచ్..కెప్టెన్ ను మార్చినా సేమ్ సీన్

LSG vs SRH IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప‌రాజ‌య ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. హైద‌రాబాద్ వేదిక‌గా ఉప్ప‌ల్ మైదానంలో జ‌రిగిన తొలి పోరులో కేర‌ళ స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో 72 ప‌రుగుల‌తో ఓట‌మి పాలైంది.

ఇక తాజాగా ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన రెండో లీగ్ మ్యాచ్ లో కేఎల్ సార‌థ్యంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(LSG vs SRH IPL 2023)  చేతిలో ఖంగుతింది. ఏ కోశాన త‌న ఆట తీరును ఈ జ‌ట్టు మార్చుకోలేదు. విండీస్ క్రికెట‌ర్ బ్రియ‌న్ లారా కోచ్ గా ఉన్న‌ప్ప‌టికీ ఆట‌గాళ్ల‌లో ఎలాంటి పోరాట ప‌టిమ క‌నిపించ లేదు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే మొద‌ట‌గా బ్యాటింగ్ కు దిగింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. ఇక టోర్నీలో ల‌క్నోకు ఇది రెండో గెలుపు కావ‌డం విశేషం. తొలి మ్యాచ్ లో ఆ జ‌ట్టు డేవిడ్ వార్న‌ర్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై విజ‌యం సాధించింది.

లక్నో ముందు హైద‌రాబాద్ 122 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ముందుంచింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 35 ర‌న్స్ చేస్తే, కృనాల్ పాండ్యా 34 ప‌రుగుల‌తో రాణించారు. ఇక హైద‌రాబాద్ త‌ర‌పున రాహుల్ త్రిపాఠి 35 ర‌న్స్ చేస్తే అన్మోల్ ప్రీత్ సింగ్ 31 ర‌న్స్ చేశారు. కృనాల్ పాండ్యా హైద‌రాబాద్ న‌డ్డి విరిచాడు.

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 5వ ఓవ‌ర్ లో మ‌యాంక్ అగ‌ర్వాల్ వికెట్ ను కోల్పోయింది. కెప్టెన్ రాహుల్ ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దాడు. దీపక్ హూడా వ‌చ్చినా ఫ‌లితం లేక పోయింది. త్వ‌ర‌గా ఔట్ కావ‌డంతో కృనాల్ పాండ్యా 34 ర‌న్స్ చేసి స‌త్తా చాటాడు. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో కీల‌క పాత్ర పోషించాడు పాండ్యా.

Also Read : లారా ఉన్నా రాత మార‌ని హైద‌రాబాద్

Leave A Reply

Your Email Id will not be published!