LSG vs MI : ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022లో టైటిల్ ఫెవరేట్ గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ అత్యంత పేలవమైన ప్రదర్శనతో మరోసారి నిరాశకు గురి చేసింది.
ఏ కోశాన ఆ జట్టులో గెలవాలన్న కసి, తపన కనిపించడం లేదు.
టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి లక్నో తో జరిగిన లీగ్ మ్యాచ్ దాకా ఓడి పోవడం ఇది ఎనిమిదో మ్యాచ్ .
అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క గెలుపు సాధించక పోవడం తాజా, మాజీ ఆటగాళ్లనే కాదు ఫ్యాన్స్ ను తీవ్ర ఆలోచనలో పడేసింది.
ముంబై ఇండియన్స్ కు భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహిస్తున్న రోహిత్ శర్మ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ ఏడాది లోనే ఆస్ట్రేలియా వేదికగా వరల్డ్ కప్ టీ20 జరగనుంది.
గతంలో 8 జట్లు మాత్రమే ఉండేవి. కానీ ఈసారి రెండు అదనపు జట్లు చేరాయి. ఒకటి గుజరాత్ టైటాన్స్ (LSG vs MI )కాగా మరొకటి లక్నో సూపర్ జెయింట్స్ .
ఇప్పుడు ఈ రెండు జట్లు దుమ్ము రేపుతున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్ 4 స్థానాల్లోకి చేరుకున్నాయి.
ఓ వైపు సన్ రైజర్స్(LSG vs MI )సత్తా చాటుతుంటే ఇంకో వైపు రాజస్థాన్ రాజస్తాన్ని ప్రదర్శిస్తుంటే చెన్నై పరువు పోకుండా కాపాడుకుంటే ముంబై మాత్రం ఏమీ పట్టనట్లు ఆడుతోంది.
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ప్లే ఆఫ్స్ ఆశలు లేనట్టే.
36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది ముంబై. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 రన్స్ చేసింది.
కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. 62 బంతులు ఎదుర్కొని 103 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 12 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి.
అనంతరం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 రన్స్ మాత్రమే చేసింది. రోహిత్ శర్మ 39 రన్స్ చేశాడు.
Also Read : ఆర్సీబీ నా ఫెవరేట్ టీం – హ్యారీ కేన్