LSG Celebrations : విజ‌యానందం ‘ల‌క్నో’ సంబురం

స్వీట్ క‌రోలిన్ సాంగ్ తో ఖుషీ 

LSG Celebrations  : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ 2022 (IPL) లో భాగంగా కొత్త‌గా ఎంట‌ర్ అయిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(LSG Celebrations )బోణీ కొట్టింది ఎట్ట‌కేల‌కు. ఫ‌స్ట్ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఓట‌మి పాలైంది.

మ‌రో వైపు డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉన్న చెన్నై సూప‌ర్ కింగ్స్ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో మొద‌టి మ్యాచ్ ఓడి పోయింది. ఈ త‌రుణంలో సీఎస్కే దుమ్ము రేపింది. అద్భుతంగా ఆడింది.

భారీ స్కోర్ చేసింది. ఏకంగా నిర్ణీత ఓవ‌ర్ల‌లో 210 ప‌రుగులు చేసింది. రాబిన్ ఉత‌ప్ప‌, శివ‌మ్ దూబే దుమ్ము రేపారు. ఉత‌ప్ప 50 ప‌రుగులు చేస్తే శివ‌మ్ దూబే 49 ర‌న్స్ చేసి కీల‌క పాత్ర పోషించారు.

ఆ త‌ర్వాత బ‌రిలోకి దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (LSG Celebrations )అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించింది. క్వింట‌న్ డికాక్ , ఎలీస్ లూయిస్ స‌త్తా చాటారు. గెలుస్తుంద‌నుకున్న సీఎస్కే (CSK) ఆశ‌లపై నీళ్లు చ‌ల్లింది ల‌క్నో. ఫోర్లు, సిక్స‌ర్ల మోత మోగించింది.

తాజాగా గెలుపొందిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (LSG) స్కిప్ప‌ర్ కేఎల్ రాహుల్ (KL Rahul) సార‌థ్యంలో డ్రెస్ రూమ్ లో సంతోషాన్ని   పంచుకున్నారు. అంతే కాదు సంబురాల్లో మునిగి పోయారు. ఐపీఎల్ (IPL) 15 సీజ‌న్ లో తొట్ట‌తొలి విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన సాంగ్ స్వీట్ క‌రోలిన్ కు స్వ‌రం క‌లిపారు ల‌క్నో ఆట‌గాళ్లు. సీఎస్జి ఆటగాళ్లు చేసుకున్న సంబురాల‌తో కూడిన వీడియో, ఫోటోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఇదిలా ఉండ‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (LSG) జ‌ట్టు కెప్టెన్ తో పాటు మెంటార్ గా ఉన్న బీజేపీ ఎంపీ, మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ పాల్గొన్నారు.

Also Read : అత్య‌ధిక వికెట్ల వీరుడు బ్రావో

Leave A Reply

Your Email Id will not be published!