Kandikonda : తెలుగు సినిమా రంగం మరో దిగ్గజ గేయ రచయితను కోల్పోయింది. కేవలం 49 ఏళ్ల వయసు కలిగిన కందికొండ లేక పోవడంతో ఒక్కసారిగా విస్తు పోయారు అభిమానులు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు పాటలు రాశారు.
తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన గొప్ప రచయిత. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న కందికొండ పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. కొన్నాళ్లుగా గొంతు క్యాన్సర్ తో బాధ పడుతున్నారు.
ఆస్పత్రి ఖర్చులు భారీగా చెల్లించాల్సి వస్తుండడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. కందికొండ పరిస్థితి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం ప్రకటించారు. జనాన్ని కదిలించే పాటలను రాశారు.
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తీసిన సినిమాల్లో పాటలు రాశారు కందికొండ(Kandikonda). ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లోని నాగుర్లపల్లి. చిన్నప్పటి నుంచే పాటలు రాయడం నేర్చుకున్నారు.
ఇంటర్ చదువుతున్న సమయంలో సంగీత దర్శకుడు చక్రితో పరిచయం ఏర్పడింది. ఫస్ట్ జానదప గీతాలు రాశారు. ఆ తర్వాత చక్రి సంగీతంలో పలు సినిమాలకు పని చేశారు.
ఆయన రాసిన మళ్లీ కూయవే గువ్వా అన్న పాట సంచలనం సృష్టించింది. పూరీ అవకాశాలు ఇస్తూ వచ్చారు. 12 ఏళ్ల పాటు సినీ రంగంలో ఉన్నారు. 1000కి పైగా పాటలు రాశారు.
తెలంగాణ జానపద గీతాలకు ప్రాణం పోశారు. తెలంగాణ యాస, భాషకు పెట్టింది పేరు కందికొండ యాదగిరి.
Also Read : దుబాయ్ వేదిక పై ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్