M. K. Stalin: నీట్‌ నుంచి మినహాయింపు కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మాణం !

నీట్‌ నుంచి మినహాయింపు కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మాణం !

M. K. Stalin: వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ‘నీట్‌’ నుంచి తమిళనాడును మినహాయించాలని, ఇందుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు శాసనసభలో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీర్మానాన్ని ప్రతిపాదించగా… దీనిని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్(M. K. Stalin) మాట్లాడుతూ… నీట్‌లో ఇటీవల జరిగిన అవకతవకలు పోటీ పరీక్షలపై విద్యార్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాయని తెలిపారు. నీట్‌ నిర్వహణపై ఆరోపణలను నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం… సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత సీబీఐ విచారణకు ఆదేశించిందన్నారు. ఈ నేపథ్యంలో నీట్ పరీక్షపై విద్యార్ధుల్లో నమ్మకం సన్నగిల్లిందని… కాబట్టి ఈ నీట్ నుండి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు పార్లమెంట్‌ లో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్, బిహార్‌ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌ తదితర నేతలు నీట్‌ను రద్దు చేయాలని లేఖలు రాశారని గుర్తు చేసారు.

M. K. Stalin Comment

దేశ రాజకీయాలు నీట్ పరీక్ష చుట్టూ తిరుగుతున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఈ నీట్ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు నీట్ పరీక్ష పేపర్ బీహార్ లో లీకైనట్లు అక్కడి పోలీసులు తేల్చారు. దీనితో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్ పరీక్ష అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో నీట్ పరీక్ష నుండి తమకు మినహాయింపు కావాలని తమిళనాడు ప్రభుత్వం కోరడం చర్చనీయాంశంగా మారింది.

Also Read : Minister Ram Mohan Naidu : వారి రాజకీయ లబ్ధి కోసమే ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటనపై ఆరోపణలు

Leave A Reply

Your Email Id will not be published!