Venkaiah Naidu Tour : నెల్లూరు జిల్లాలో వెంకయ్య పర్యటన
10 నుంచి 14 వరకు ఐదు రోజుల టూర్
Venkaiah Naidu Tour : భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు గాను ఐదు రోజుల పాటు జిల్లాలోనే ఉండనున్నారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఆయనకు సాదర స్వాగతం పలికేందుకు ఘనంగా నిమగ్నమయ్యారు అభిమానులు.
జూన్ 10 శనివారం ముప్పవరపు వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) రైలు మార్గంలో రాత్రి 7 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. పట్టణంలోని సర్దార్ పటేల్ నగర్ లోని తన కుమారుడి నివాసంలో బస చేస్తారు. 11న నర్రవాడ వెంగమాంబ తిరుణాళ్లకు బయలు దేరుతారు. అక్కడ అమ్మ వారిని దర్శించుకుంటారు వెంకయ్య నాయుడు. అనంతరం అక్కడి నుంచి ఉదయగిరికి చేరుకుంటారు. నగరంలో నిర్వహించే ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ముప్పవరపు వెంకయ్య నాయుడు పాల్గొంటారు. రాత్రికి సర్దార్ పటేల్ నగర్ లోని నివాసంలో బస చేస్తారు.
12న శ్రీ కస్తూరి దేవి స్కూల్ ప్రాంగణంలోని ఠాగూర్ భవనంలో నిర్వహించే గురువుకు వందనం కార్యక్రమంలో పాల్గొంటారు. వెంకయ్య నాయుడు తనకు పాఠాలు చెప్పిన గురువు మోపూరు వేణు గోపాలయ్య స్మృతి సంచికను ఆవిష్కరిస్తారు. రాత్రికి వెంకటా చలం స్వర్ణ భారత్ ట్రస్ట్ లో బస చేస్తారు.
13న స్వర్ణ భారత్ ట్రస్ట్ లో నిర్వహించనున్న ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. 14న రాత్రి 8 గంటలకు రైలు మార్గంలో హైదరాబాద్ బయలుదేరి వెళతారు.
Also Read : Vetrimaaran Viral : దిగ్గజ దర్శకుల అపురూప కలయిక