Madhavilatha : శ్రీవారికి లడ్డు కల్తీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాధవీలత
మరోవైపు.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఘటనను ప్రతీఒక్కరూ వ్యతిరేకిస్తున్న పరిస్థితి...
Madhavilatha : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై తెలంగాణ బీజేపీ మహిళా నేత, ఫైర్ బ్రాండ్ మాధవీలత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హిందువులు పవిత్రంగా స్వీకరించే శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటే అది అత్యాచారం కిందకే వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా వెంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా తిరుమలకు వెళ్లాలని ఆమె నిర్ణయించారు. అందులో భాగంగానే సహచర భక్త బృందంతో కలిసి మాధవీలత(Madhavilatha) తిరుమలకు బయలుదేరారు. వందేభారత్ రైలులో బీజేపీ మహిళా నేత హైదరాబాద్ నుంచి తిరుమలకు పయనమయ్యారు. వేంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని బీజేపీ నేత దర్శించుకోనున్నారు. సహచర భక్త బృందంతో కలిసి ఆ గోవిందుడి నామం జపిస్తూ.. శ్రీనివాసుడి పాటలు పాడుతూ భజన చేస్తూ వందేభారత్‌తో రైలులో మాధవీలత తిరుమలకు బయలుదేరారు.
Madhavilatha Comment
మరోవైపు.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఘటనను ప్రతీఒక్కరూ వ్యతిరేకిస్తున్న పరిస్థితి. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు రేపింది. ప్రతీ ఒక్క హిందువు, హిందూ సంఘాలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ప్రసాదాన్ని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. అటువంటి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారని నిర్థారణ అవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు సంస్థను(సిట్) కూడా ఏర్పాటు చేసింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. అక్టోబర్ 1న పవన్ తిరుమలకు వెళ్లి దీక్షను విరమించనున్నారు. అలిపిరి మెట్ల మార్గన తిరుమలకు వెళ్లి.. స్వామి వారిని దర్శించుకుని దీక్షను విరమించనున్నారు డిప్యూటీ సీఎం.
Also Read : Hydra Sanga Reddy: చెరువులో భారీ భవన్ని బాంబులతో నేలకూల్చారు