Madhuri Dixit Jadeja : కాలం విడ‌దీసిన ప్రేమ బంధం

మాధురీ దీక్షిత్..అజ‌య్ జ‌డేజా ల‌వ్

Madhuri Dixit Jadeja : ఒక‌రు సినీ రంగంలో రారాణి. మ‌రొక‌రు ప్ర‌పంచ క్రికెట్ రంగంలో దిగ్గ‌జ క్రికెట‌ర్. సినీ, క్రీడా రంగాలు క‌లిసి మెలిసి సాగుతుంటాయి. రెండూ జ‌నాద‌ర‌ణ క‌లిగిన రంగాలే. ఒక‌రిపై మ‌రొక‌రు ప్రేమ‌లో ప‌డ‌డం మామూలే.

పెళ్లి చేసుకునేంత దాకా వెళ్లి చివ‌ర‌కు విడి పోతే ఎలా ఉంటుంది. జీవితం ఒక్కోసారి ఆనందాన్ని ఇచ్చేలా చేస్తుంది. కానీ కాలం విధి రూపంలో ప్రేమ పేరుతో ప‌రీక్షిస్తుంది.

ఏ స్థాయిలో ఉన్నా బంధాన్ని తెంపేస్తుంది. బాలీవుడ్ , క్రికెట్ ఎప్పుడూ క‌లిసి సాగుతూనే ఉంటాయి.

భార‌త క్రికెట్ లో దిగ్గ‌జ క్రికెట‌ర్లుగా ఉన్న వారిలో హైద‌రాబాదీ స్టార్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్,

సంగీత బిజ్ లానీ కొన్నేళ్ల పాటు క‌లిసి ఉన్నారు. విడి పోయారు.

మ‌రో స్టార్ ప్లేయ‌ర్ ప్రస్తుత బీసీసీఐ చీఫ్ గా ఉన్న సౌర‌వ్ గంగూలీ ప్ర‌ముఖ న‌టి న‌గ్మా ప్రేమ‌లో ప‌డి పోయాడు. చివ‌ర‌కు అది ఆచ‌ర‌ణ‌కు నోచుకోలేదు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రేమ‌క‌థ‌లు. కానీ వీరంద‌రి కంటే ఎక్కువ‌గా అటు సినీ ప్రేక్ష‌కుల‌ను ఇటు క్రీడాభిమానుల‌ను విస్మ‌యానికి గురి చేసింది

మాత్రం ల‌క్ష‌లాది మ‌న‌సులు దోచుకున్న ముద్దుగుమ్మ మాధురీ దీక్షిత్ కాగా. మ‌రొక‌రు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆరాధించే క్రికెట‌ర్ అజ‌య్ జ‌డేజా(Madhuri Dixit Jadeja).

వీరిద్ద‌రి ప్రేమ పండింది. కానీ పెళ్లికి వ‌చ్చి అర్ధాంత‌రంగా నిలిచి పోయింది.

బాలీవుడ్ లో ప్రిన్స్ గా కొన్నేళ్ల పాటు ఏలింది మాధురి. ఆమె లేకుండా సినిమా లేని ప‌రిస్థితికి తీసుకు వ‌చ్చేలా చేసింది.

అంత‌కు ముందు సంజ‌య్ ద‌త్ ప్రేమ‌లో ప‌డింది ఈ ముద్దుగుమ్మ‌. మ‌నోడు జైలుకు వెళ్లాడు.

ఆ స‌మ‌యంలో ఒంట‌రిత‌నంలో ఉన్న మాధురీకి మ‌ధురంగా తోచాడు అజ‌య జ‌డేజా.

పూర్తిగా ఇంట్రావ‌ర్ట్ గా ఉండే ఈ క్రికెట‌ర్ ను ప్రోత్స‌హించింది మాత్రం అజ‌హరుద్దీన్.

దీక్షిత్ కు అద్భుతంగా తోచాడు జ‌డేజా. వీరిద్ద‌రి ప్రేమ అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది.

ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాల‌లో వీరి గురించి ప్ర‌తి రోజూ పుంఖాను పుంఖానుగా క‌థ‌నాలు వ‌చ్చాయి. ఫోటోల గురించి చెప్పాల్సిన ప‌ని లేదు.

విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ పెళ్లి చేసుకోగా హార్దిక్ పాండ్యా న‌టాసా హాయిగా జీవిస్తున్నారు.

కానీ వీరిలా కాదు మాధురీ దీక్షిత్ ..అజ‌య్ జ‌డేజా(Madhuri Dixit Jadeja) ప్రేమ‌. ఆనందంతో ప్రారంభ‌మై విషాదంగా ముగిసింది వీరి ప్రేమ‌కథ‌.

ఓ ఫోటో షూట్ సంద‌ర్భంగా క‌లుసుకున్నారు. ఆ త‌ర్వాత కంటిన్యూగా సాగింది.

ఈ త‌రుణంలో మ్యాచ్ ఫిక్సింగ్ బూతం రావ‌డం, జ‌డేజా కూడా ఉన్నార‌ని తేల్చ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింది. పెళ్లి చేసుకునేంత దాకా వెళ్లిన వీరి అమ‌రత్వంతో నిండిన ప్రేమ అర్ధాంత‌రంగా ముగిసింది.

Also Read : పీకే..త‌ల‌ప‌తి భేటీ క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!