Madhya Pradesh Won : రంజీ ట్రోఫీ విజేత మధ్యప్ర‌దేశ్

ముంబైకి కోలుకోలేని బిగ్ షాక్

Madhya Pradesh Won : రంజీ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది. విజ‌యాల బాట ప‌ట్టిన ముంబైకి కోలుకోలేని షాక్ త‌గిలింది. 2021-22 సీజ‌న్ కు గాను జ‌రిగిన రంజీ ట్రోఫీ ఫైన‌ల్ లో మ‌ధ్య ప్ర‌దేశ్ ముంబైని ఓడించి విజేత‌గా నిలించింది.

ఆరు వికెట్ల తేడాతో ముంబైని ఓడించి మొద‌టిసారిగా రంజీ విజేత‌గా అవ‌త‌రించింది. ఇదిలా ఉండ‌గా 1998-99 రంజీ సీజ‌న్ లో ఇదే జ‌ట్టు ఫైన‌ల్ లో ఓడి పోయింది. ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది.

కాగా ఈసారి కూడా ఫైన‌ల్ లో అదీ రిపీట్ అవుతుంద‌ని ముంబై జ‌ట్టు అభిమానులు అనుకున్నారు. కానీ ఊహించ‌ని రీతిలో దెబ్బ కొట్టింది మ‌ధ్య‌ప్ర‌దేశ్.

ఆట ఆడిన‌ప్ప‌టి నుంచీ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తూ స‌త్తా చాటింది ఈ జ‌ట్టు. 2 వికెట్లు కోల్పోయి 113 ప‌రుగులతో ఆట ప్రారంభించిన ముంబై జ‌ట్టు 269 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది.

జ‌ట్టులో సువేద్ పార్క‌ర్ 51 ర‌న్స్ చేయ‌గా సెంచ‌రీ స్టార్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 45 ర‌న్స్ చేసి మెరిశాడు. పృథ్వీ షా 44 ప‌రుగుల‌తో రాణించాడు. ఇక మిగ‌తా ఆట‌గాళ్లు ఎవ‌రూ స‌త్తా చాట‌లేక పోయారు.

ప్ర‌ధానంగా మ‌ధ్య ప్ర‌దేశ్ బౌల‌ర్లు కుమార్ కార్తికేయ నిప్పులు చెరిగాడు. అద్భుత‌మైన బంతుల‌తో క‌ట్ట‌డి చేశాడు. నాలుగు వికెట్లు తీసి స‌త్తా చాటాడు. గౌర‌వ్ యాద‌వ్ , స‌హానీ చెరో రెండు వికెట్లు తీసి కీల‌క పాత్ర పోషించారు.

అనంత‌రం 108 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన మ‌ధ్య ప్ర‌దేశ్ సునాయ‌సంగా ఛేదించింది. హిమాన్షు 37 ర‌న్స్ చేస్తే శుభ‌మ్ శ‌ర్మ 30, ర‌జిత్ పాటిదార్ 30 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు జ‌ట్టును గెలిపించారు.

Also Read : స్మృతి మంధాన అరుదైన రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!