Maha Kumbh Mela-Kharge : కుంభమేళాలో తొక్కిసలాట పై భగ్గుమన్న ఖర్గే..ఆ వ్యాఖ్యలను వినక్కి తీసుకోవాలని చైర్మన్

ఈ సందర్భంగా ఖర్గే స్పందిస్తూ....

Maha Kumbh Mela : మహాకుంభమేళాలో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాట(Stampede) ఘటన పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మౌని అమావాస్య సందర్భంగా కోట్ల మంది భక్తులు వస్తారని తెలిసినా సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని సభ్యులు ఆరోపించారు. తొక్కిసలాట ఘటనలో వేలాది మంది చనిపోయారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సంచలన ప్రకటన చేశారు. వారందరికీ నివాళులర్పిస్తున్నాన్నారు. దీనిపై అధికార పక్ష సభ్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.

Maha Kumbh Mela-Khagre Comments

దీనిపై స్పందించిన చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌.. ఖర్గే(Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఖర్గే స్పందిస్తూ.. ‘‘తొక్కిసలాట మృతుల విషయంలో ఇది నా అంచనా! ఒకవేళ ఇది తప్పయితే వాస్తవం ఏంటో మీరు చెప్పండి. సరిచేసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా’’ అని అన్నారు. ఎవరినో తప్పుపట్టేందుకు తాను ‘వేలాదిమంది’ అని అనలేదని, కనీసం ఇప్పటికైనా ఎంత మంది చనిపోయారో సమాచారం ఇస్తారని అలా అన్నానని తెలిపారు. ఒకవేళ తాను తప్పు చేసి ఉంటే క్షమాపణలు చెబుతానన్నారు. తొక్కిసలాటలో ఎంత మంది మృతి చెందారో.. ఎంత మంది అదృశ్యమయ్యారో ఇప్పటికైనా లెక్కలు చెప్పాలన్నారు.

తొక్కిసలాటలో మృతి చెందిన వారి పార్థివ దేహాలను సంగమంలోకి విసిరివేశారని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) సభ్యురాలు జయా బచ్చన్‌ ఆరోపించారు. దీంతో పవిత్ర మహాకుంభమేళా కలుషితం అయిపోయిందన్నారు. ఆమె పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం నీరు ఎక్కువగా కలుషితం అయింది ఎక్కడ? కచ్చితంగా అది కుంభ్‌లోనే. ఎందుకంటే తొక్కిసలాట మృతుల పార్థివ దేహాలను సంగమంలోనే పడేశారు’’ అన్నారు. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై లోక్‌సభలో విపక్ష పార్టీల సభ్యులు ఆందోళన చేశారు. ఈ ఘటనపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి తొక్కిసలాట ఘటనపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్‌ నేతలు గౌరవ్‌ గొగోయ్‌, కేసీ వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు. తొక్కిసలాట ఘటన విపత్తు కాదని, ప్రభుత్వ వైఫల్యమేనని సమాజ్‌వాదీ ఎంపీ నరేశ్‌ చంద్ర అన్నారు. సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు.

Also Read : TG Assembly Meet : కులగణన నివేదికపై చర్చించనున్న అసెంబ్లీ

Leave A Reply

Your Email Id will not be published!