Maharashtra Elections : ఎట్టకేలకు మహారాష్ట్ర సీఎం అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగి షిండేను శాంతింపజేసినట్లు సమాచారం...

Maharashtra : మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభ సమావేశంలో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలోని మీటింగ్ హాల్‌లో జరిగిన బీజేపీ కోర్ గ్రూప్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర(Maharashtra Elections) శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడై పది రోజులు గడుస్తున్నా.. సీఎం ప్రమాణ స్వీకారం జరగలేదు. మహాయుతి కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వచ్చినా.. సీఎంగా ఎవరు ఉండాలనే విషయంలో మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఆలస్యమైందనే ప్రచారం జరిగింది. ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ సీఎం పదవి డిమాండ్ చేయకపోయినా, శివసేన(షిండే) పార్టీ మాత్రం తమకు ముఖ్యమంత్రి పదవి కావాలని చివరి వరకు డిమాండ్ చేస్తూ వచ్చింది. సీఎం పదవి ఇవ్వకపోతే తాము కోరుకున్న మంత్రిత్వశాఖలను ఇవ్వాలని అడిగినప్పటికీ బీజేపీ షిండే డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించలేనట్లు తెలుస్తోంది.

Maharashtra Elections Update

ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగి షిండేను శాంతింపజేసినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నహాలు జరుగుతున్నాయి. డిసెంబర్ ఐదో తేదీ గురువారం సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.సీఎంగా బీజేపీకి చెందిన వ్యక్తి ఉండనున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేసే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. ఇవాళ జరిగిన మహారాష్ట్ర బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో బీజేపీ శాసనసభ పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల ఏకాభిప్రాయంతో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ప్రకటించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఇద్దరు పరిశీలకులు నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ సమక్షంలో సీఎంను ఖరారు చేశారు. గురువారం మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం చేయనున్నారు.

Also Read : PM Modi-CM Stalin : ‘ఫేంగల్’ తుపాను నష్టంపై సీఎం స్టాలిన్ తో ఫోన్లో ఆరా తీసిన ప్రధాని

Leave A Reply

Your Email Id will not be published!