Maharashtra CM : ఎట్టకేలకు మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ
ఒక శాఖకు సంబంధించి సొంత డిమాండ్లు ఉంటే దాని అర్ధం కోపంగా ఉన్నట్టు కాదు...
Maharashtra CM : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోయింది. దేవేంద్ర ఫడ్నవిస్ తదుపరి ముఖ్యమంత్రి అని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుధీర్ ముంగటివార్ ప్రకటించారు.అయితే, ఇది తన అభిప్రాయంగా ఆయన చెప్పారు. బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని, బీజేపీ నుంచి ఎలాంటి ఆశ్చర్యకరమైన నిర్ణయం ఉండదని పరోక్షంగా ఫడ్నవీస్‌నే అధికారికంగా సీఎంగా ప్రకటిస్తారనే సంకేతాలిచ్చారు.
Maharashtra CM Candidate..
ఫడ్నవిస్‌ను సీఎంగా నిర్ణయించే విషయంలో షిండేకు ఎలాంటి కోపం లేదని కూడా ముంగటివార్ చెప్పారు. ”ఒక శాఖకు సంబంధించి సొంత డిమాండ్లు ఉంటే దాని అర్ధం కోపంగా ఉన్నట్టు కాదు. షిండేకు తగిన గౌరవం ఉంటుంది. ఆయన కూడా ప్రభుత్వంలో పాలుపంచుకుంటారని అనుకుంటున్నాను” అని అన్నారు. డిసెంబర్ 5న ముంబైలో కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం భారీ స్థాయిలో ఉంటుందని చెప్పారు. కాగా, మహారాష్ట్ర() కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరు ఖరారైందని, లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు డిసెంబర్ 2 లేదా 3వ తేదీన సమావేశం ఉంటుందని మరో బీజేపీ నేత తెలిపారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ నిర్ణయానికి తన మద్దతు ఉంటుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి షిండే సైతం ఇప్పటికే ప్రకటించారు.
Also Read : Anand Mahindra : విమర్శించిన నెటిజన్ కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా