Maharashtra Elections : ఈరోజు ధూమ్ ధామ్ అని జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు...
Maharashtra Elections : మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సరిగ్గా ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. జార్ఖండ్ అసెంబ్లీకి రెండో విడత పోలింగ్, ఉత్తరప్రదేశ్‌లో ఉప ఎన్నిక జరుగుతోంది. మహారాష్ట్ర(Maharashtra) కన్నా జార్ఖండ్ ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి కనబరిచారు. ఉదయం 9 గంటల వరకు జార్ఖండ్ ఓటింగ్ శాతం కాస్తా ఎక్కువగా ఉంది.
Maharashtra Elections Update
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ తారలు, ప్రముఖ క్రికెటర్లు, నేతలు క్యూ లైన్‌లో నిల్చొని ఓటు వేశారు. మేం ఓటేశాం.. మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ‘పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరు ఓటు వేయండి. అన్నింటి కన్నా ముఖ్య విషయం ఓటు వేయడం అని’ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కోరారు.
నా బాధ్యతను నేను నిర్వర్తించా. ఓటు అనేది ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. ఇళ్ల నుంచి బయటకొచ్చి అందరూ ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించుకోవాలి అని’ మరో హీరో రాజ్ కుమార్ రావు పిలుపునిచ్చారు. క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ కూతురుతో వచ్చి ఓటు వేశారు. భార్య జెనీలియాతో కలిసి నటుడు రితేష్ దేశ్‌ముఖ్ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. దర్శకుడు ఫర్హాన్ అకర్త్, జొయా అక్తర్, రష్మీ నిగమ్, సోను సూద్, సినీ దర్శకుడు కబీర్ ఖాన్, సీనియర్ నటి సుభా ఖొటే కూతురుతో వచ్చి ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం సిరా గుర్తును మీడియాకు చూపించారు.
Also Read : AP Govt : కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు లేఖ రాసిన న్యాయశాఖ కార్యదర్శి