Maharashtra Governor : మరాఠా ప్రజలారా మన్నించండి
ఎట్టకేలకు దిగొచ్చిన భగతస్ సింగ్ కోశ్యారి
Maharashtra Governor : మహారాష్ట్ర గవర్నర్ భగత్ సిగ్ కోశ్యారీ ఎట్టకేలకు దిగి వచ్చారు. తాను మరాఠా ప్రజల గురించి ప్రత్యేకించి ముంబై వాసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు చించిస్తున్నట్లు పేర్కొన్నారు.
సోమవారం ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. తనను మన్నించమని కోరారు. మరాఠా ప్రజలు కష్టజీవులు..వారి యోధులంటూ కొనియాడారు. తాను కావాలని అనలేదని, మీ మనస్సులు నొప్పిస్తే క్షమించమంటూ వేడుకున్నారు.
తాజాగా గవర్నర్ రాజస్థానీలు, గుజరాతీలు లేకపోతే మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటుందని, అప్పుడు ముంబై దేశ ఆర్థిక రాజధానిగా ఉండదని అప్పుడు అంతా ఖాళీ అవుతుందని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన క్షమాపణల్ని మారాఠీలో చెబుతూ ట్వీట్ లో తెలిపారు. ఇదిలా ఉండగా భగత్ సింగ్ కోశ్యారీ జూలై 29న అందేరీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీంతో పెద్ద ఎత్తున మహారాష్ట్రలో రాద్దాంతం చెలరేగింది. ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం కూడా గవర్నర్(Maharashtra Governor) కామెంట్స్ ను తప్పు పట్టింది. మరాఠా ప్రజలు భగ్గుమన్నారు.
ఈ సందర్భంగా శివసేన చీఫ్ , మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే అయితే ఏకంగా గవర్నర్ ను తప్పిస్తారా లేక జైలుకు పంపిస్తారా అని ప్రశ్నించారు.
ఇక గవర్నర్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని తమకు సంబంధం లేదన్నారు సీఎం ఏక్ నాథ్ షిండే. మరాఠా ప్రజల్ని ఎవరు అవమానించినా తాము సహించ బోమంటూ స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ నాన పటోలే. కేంద్రం సీరియస్ కావడంతో గవర్నర్ దిగి వచ్చారు.
Also Read : అమ్ముకుంటూ పోతే శ్రీలంక సీన్
मा. राज्यपालांचे निवेदन pic.twitter.com/3pKWHYgPp8
— Governor of Maharashtra (@maha_governor) August 1, 2022