Maharastra Sikh Group : వివేక్ అగ్నిహోత్రి పై సిక్కు సంస్థ ఫైర్
మహారాష్ట్ర సిక్కు గ్రూప్ తీవ్ర ఆగ్రహం
Maharastra Sikh Group : ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ , నిర్మాత వివేక్ రంజన్ అగ్ని హోత్రిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ తో వచ్చిన కిక్కుతో తాజాగా ఆయన ది ఢిల్లీ ఫైల్స్ సినిమా తీస్తానని ప్రకటించారు.
దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది మహారాష్ట్ర సిక్కు గ్రూప్ (సంస్థ). సృజనాత్మక వ్యక్తీకరణ , వ్యక్తిగత లాభదాయకత పేరుతో ఆనాడు చోటు చేసుకుంటున్న దురదృష్టకర విషాద అధ్యాయాలను తిరిగి తెరకెక్కంచడంపై మండిపడుతోంది.
ఇటీవలే ఫిల్మ్ మేకర్ అగ్నిహోత్రి సినిమా తీస్తానంటూ డిక్లేర్ చేశాడు. చిత్ర నిర్మాతలు లేదా దర్శకులు సమాజంలో అశాంతికి భంగం కలిగించడం మాను కోవాలని మహారాష్ట్ర సిక్కు సంఘం (Maharastra Sikh Group) స్పష్టం చేసింది.
ఒక వర్గాన్ని కించ పర్చడం, ఇంకో వర్గాన్ని సంతోష పర్చడం కోసం సినిమాలు తీయడం అన్నది మంచి పద్దతి కాదని సూచించింది. ఒక రకంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సిక్కు సంస్థ.
ఇదిలా ఉండగా ది ఢిల్లీ ఫైల్స్ లో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు కనిపిస్తాయని ప్రచారం జరుగుతోంది. గత వారం వివేక్ అగ్ని హోత్రి తన తదుపరి ప్రాజెక్టు ప్రకటించిన నాటి నుంచి పెద్ద ఎత్తున రాబోయే మూవీపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలకు స్పందించాడు డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహొత్రి. ఒక చిత్ర నిర్మాతగా, దర్శకుడిగా తన భావాలను వ్యక్త పరిచేందుకు తనకు హక్కు ఉందన్నాడు.
వాస్తవాలు తెలుసు కోకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు డైరెక్టర్.
Also Read : స్కిప్ట్ నచ్చితే చాలు – హన్సిక