Mahela Jayawardene : ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే(Mahela Jayawardene) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2022లో ఆయా జట్ల మధ్య కొన్ని నిర్ణయాలు కీలకంగా మారాయి. మరికొన్ని వివాదాస్పం అవుతున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చోటు చేసుకున్న వివాదం తీవ్ర చర్చకు తీసింది. చివరకు ఇండియన్ ప్రిమీయర్ లీగ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డేనియల్ మనోహర్ అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ స్కిప్పర్ రిషబ్ పంత్ కు షాక్ ఇచ్చాడు.
మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించడంతో పాటు మైదానంలోకి వచ్చి రచ్చ రచ్చ చేసిన ఆ జట్టు కోచ్ ప్రవీణ్ ఆమ్రేను ఒక మ్యాచ్ కు దూరంగా ఉండాలంటూ నిషేధం విధించాడు.
ఈ మ్యాచ్ ఆఖరు వరకు రసవత్తరంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 222 రన్స్ చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఢిల్లీ సైతం అదే రీతిన జవాబు ఇచ్చింది.
కానీ ఆఖరు ఓవర్ వరకు వచ్చే సరికల్లా 36 రన్స్ చేయాల్సి ఉంది. అప్పటికే మూడు బంతుల్లో మూడు సిక్స్ లు కొట్టాడు. అయితే మూడో బంతి భుజం పైకి వచ్చిందని దానిని నో బాల్ గా ప్రకటించాలంటూ పంత్ కోరాడు.
ఆపై మైదానంలోకి రావడం, ఆటగాళ్లను ఆడ నీయకుండా పెవిలియన్ కు రావాలని ఆదేశించడం క్రీడా స్పూర్తిని దెబ్బ తీసింది. ఆ తర్వాత క్షమాపణలు చెప్పినా పంత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఈ తరుణంలో ఐపీఎల్ లో రూల్స్ కొన్నింటిని మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు మహేళ జయవర్దనే.
Also Read : చరిత్ర సృష్టించిన అశ్విన్