Mahela Jayawardene : మూడు ఫార్మాట్ లలో బాబర్ టాపర్
మాజీ క్రికెటర్ మహేల జయవర్దనే
Mahela Jayawardene : ప్రపంచ క్రికెట్ లోని మూడు ఫార్మాట్ ( టెస్టు, వన్డే, టి20) లలో టాపర్ ఎవరనే దానిపై కీలక వ్యాఖ్యలు చేశాడు శ్రీలంక మాజీ కెప్టెన్, ప్రస్తుత ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్దనే. నెంబర్ వన్ ఎవరనే చర్చకు పుల్ స్టాప్ పెట్టాడు.
చాలా మంది ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ ను ప్రస్తావిస్తుండగా జయవర్దనే(Mahela Jayawardene) మాత్రం అన్నింట్లోనూ దాయాది పాకిస్తాన్ జట్టుకు స్కిప్పర్ గా ఉన్న బాబర్ ఆజమ్ ను పేర్కొన్నాడు.
అతడే నెంబర్ వన్ అంటూ డిక్లేర్ చేశాడు. ఐసీసీ ప్రతి ఏటా ర్యాంకింగ్స్ లు ప్రకటిస్తూ వస్తుంటుంది. అటు బ్యాటర్లు, బౌలర్లు, ఆల్ రౌండర్లు పురుషుల, మహిళల ఆటగాళ్లకు సంబంధించి.
ఇదే సమయంలో ప్రతి నెలా ప్లేయర్ ఆఫ్ ది మంత్ పేరుతో కూడా అవార్డులు డిక్లేర్ చేస్తుంది. తాజాగా మహేల జయవర్దనే చేసిన ఈ వ్యాఖ్యలు క్రీడా వర్గంలో ముఖ్యంగా క్రికెట్ రంగంలో కలకలం రేపుతోంది.
తాను ఎందుకు జో రూట్ ను కాదని పాకిస్తాన్ స్కిప్పర్ ను ఎంపిక చేయాల్సి వచ్చిందనే దానికి క్లారిటీ ఇచ్చాడు. బాబర్ ఆజమ్ టెక్నికల్ గా బాగా రాణించాడని, ఇది గత రెండేళ్లలో మూడు ఫార్మాట్ లలో తన విజయానికి ప్రధాన కారణమని చెప్పాడు
. టెస్టు క్రికెట్ లో సైతం అతడికే ప్రయారిటీ ఇచ్చాడు. బాబర్ ఆజమ్ కు అవకాశం ఉందని తాను నమ్ముతానని తెలిపాడు. అతడు సహజంగా ప్రతిభావంతమైన ఆటగాడు. అన్ని పరిస్థితులలో ఆడతాడని కితాబు ఇచ్చాడు జయవర్దనే.
Also Read : కనిపించని జాత్యహంకారం నిజం – రాస్ టేలర్