Mahesh Babu Chai : చాయ్ కి మహేష్ బాబు ఫిదా
టీ రియల్ లైఫ్ లో కూడా
Mahesh Babu Chai : ఇవాళ ప్రపంచ టీ దినోత్సవం. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. సామాన్యుల నుంచి సినీ స్టార్స్ వరకు ఎప్పుడో ఒకప్పుడు చాయ్ తాగిన వాళ్లే. ఉదయం నుంచి రాత్రి పడుకునేంత దాకా విపరీతమైన షెడ్యూల్స్ లో బిజీగా ఉంటారు.
ఒక్కోసారి అనుకున్న సీన్స్ రావు. దీంతో తల బరువుగా అనిపిస్తుంది. ఇంకో వైపు తనపై పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టు యాక్టింగ్ చేయాలన్న తపన, కసి, ఒత్తిడి చివరకు తల భారంగా అనిపించేలా చేస్తుంది.
వీటన్నింటిని కవర్ చేస్తూ వెంటనే కూల్ చేసేస్తూ జోష్ తీసుకు వచ్చే ఇంధనం, అరుదైన పానియం టీ. అందుకే కోట్లాది మంది చాయ్ అంటే పడి చస్తారు. దేశంలో హైదరాబాద్ ఇరానీ చాయ్ కి ఉన్నంత డిమాండ్ ఇంకే టీకి లేదు.
టీలో వందల రకాలు ఉన్నాయి. ఇక సినిమాల్లో చాలా సార్లు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు(MaheshBabu) టీ తాగుతూ కనిపిస్తారు. అదో ఆయన స్టైల్. ఇక రీల్ లోనే కాదు రియల్ లైఫ్ లో మనోడికి టీ అంటే ఇష్టం.
టీ మార్కెట్ లో డిఫరెంట్ ఫ్లేవర్స్ లో అందుబాటలో ఉన్నాయి. తాజాగా టీని స్వీప్ చేస్తూ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. చాయ్ పేదోడికే కాదు పెద్దోళ్లకు కూడా టానిక్ లాగా మారి పోయింది.
ఇక సినీ రైటర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, దర్శకులు, నటీ నటులు, కొరియో గ్రాఫర్లు, కెమెరామెన్లు ఇలా ప్రతి ఒక్కరు చాయ్ కి బానిసైన వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. చాయ్ కి ఉన్నంత ప్రయారిటీ ఇంకెందులోనూ లేదంటే నమ్మలేం.
ఇండియాలో ఏ మూలకు వెళ్లినా టీ కొట్లు కనిపిస్తాయి. అందరికీ అందుబాటులో దొరికే ఈ చాయ్ ను రుచి చూడకుండా ఉండలేరు.
Also Read : రాహుల్ గాంధీ టీ ప్రియుడు