Mahipal Lomror : ఎవ‌రీ మ‌హిపాల్ క్రిష‌న్ లోమ్రోర్

ఆర్సీబీ విజ‌యంలో కీల‌క పాత్ర

Mahipal Lomror  :  ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో హ్యాట్రిక్ ఓట‌ముల త‌ర్వాత రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యాన్ని న‌మోదు చేసింది. పుణె వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ పై 13 ప‌రుగుల తేడాతో విక్ట‌రీ సాధించింది.

ఈ విజ‌యంలో బౌలింగ్ ప‌రంగా హ‌ర్ష‌ల్ ప‌టేల్ స‌త్తా చాటితే బ్యాటింగ్ ప‌రంగా మ‌హిపాల్ లోమ్రోర్(Mahipal Lomror )అద్భుతంగా ఆడి ఆదుకున్నాడు. టాస్ ఓడి పోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 173 ప‌రుగులు చేసింది.

ఈ స్కోర్ లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ మ‌హిపాల్ లోమ్రోర్ దే. 27 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 42 ర‌న్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు ఒక సిక్స‌ర్ ఉన్నాయి. ఎవ‌రీ మ‌హిపాల్ లోమ్రోర్ పేరు కొత్త‌గా ఉన్న‌ట్టు అనిపిస్తుంది.

ఈ క్రికెట‌ర్ మ‌నోడే. పూర్తి పేరు మ‌హిపాల్ క్రిష‌న్ లోమ్రోర్. 16 న‌వంబ‌ర్ 1999లో రాజ‌స్థాన్ లోని నాగౌర్ లో పుట్టాడు. ఇత‌డి వ‌య‌స్సు 22 ఏళ్లు. ఎడ‌మ చేతి వాటం బ్యాట‌ర్. బౌల‌ర్ కూడా. ఆల్ రౌండ‌ర్.

ప్ర‌స్తుతం ఆర్సీబీ త‌ర‌పున ఆడుతున్నాడు. 2016 నుంచి రాజ‌స్థాన్ జ‌ట్టు త‌ర‌పున కంటిన్యూ అవుతూ వ‌స్తున్నాడు. 2018 నుంచి 2021 దాకా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు.

2022 ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీల్లో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఆర్సీబీ యాజ‌మాన్యం అత‌డిని ద‌క్కించుకుంది. 2016 అండ‌ర్ -19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. దేశీవాళీ క్రికెట్ లో స‌త్తా చాటాడు మ‌హిపాల్ క్రిష‌న్ లోమ్రోర్(Mahipal Lomror ).

Also Read : టీ20లో భార‌త్ టెస్టులో ఆసిస్ వ‌న్డేలో కీవీస్

Leave A Reply

Your Email Id will not be published!