Mahua Moitra : కావాలని రాద్దాంతం మోయిత్రా ఆగ్రహం
తప్పని నిరూపించాలంటూ సవాల్
Mahua Moitra : కాళీ దేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రాపై(Mahua Moitra) భారతీయ జనతా పార్టీ భగ్గుమంటోంది. ఆమెపై పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ మండిపడ్డారు. ఆపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దీంతో ఎంపీపై పోలీస్ కేసు నమోదు చేశారు. దీనిపై మహూవా మోయిత్రా నిప్పులు చెరిగారు. తనకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయలు, నాగరికత గురించి తెలుసన్నారు.
హిందూత్వానికి తామేదో ప్రతినిధులుగా బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముందు బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు టీఎంసీ ఎంపీ.
ఇదే సమయంలో తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న మహూవా మోయిత్రాకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో మాట్లాడే హక్కు, ప్రశ్నించే అవకాశం ప్రతి ఒక్క భారతీయుడికి ఉందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా దమ్ముంటే తాను మాట్లాడిన దాంట్లో తప్పు అనేది ఉంటే నిరూపించాలని భారతీయ జనతా పార్టీకి మహూవా మోయిత్రా(Mahua Moitra) సవాల్ విసిరారు.
నూపుర్ శర్మ ప్రవక్తను కించ పరిస్తే తాను దేవతలను సెలబ్రేట్ చేశానని చెప్పారు. ఈ విషయాన్ని టీఎంసీ ఎంపీ జాతీయ మీడియా చానల్ తో చెప్పారు.
బెంగాల్ లో ఎక్కడ కేసు పెట్టినా అక్కడ 5 కి.మీ దూరంలో కాళీ ఆలయం ఉంటుందన్నారు. అక్కడ ప్రతి చోటా దేవతలను పూజిస్తారని చెప్పారు మహూవా మోయిత్రా.
Also Read : మహూవా మోయిత్రాకు శశి థరూర్ మద్ధతు