Earthquake Turkey : ప్రకృతి ప్రకోపం టర్కీలో భూకంపం
ప్రాణాలు కోల్పోయిన 90 మంది
Earthquake Turkey : ప్రకృతి ప్రకోపానికి టర్కీలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఇప్పటి వరకు 90 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. రిక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రతతో భూమి కంపించింది. భారీ కుదుపుతో భూమి కంపానికి గురైంది. టర్కీ లోని సిరియా, టర్కీలో భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకు ఈ ఏడాది లో చోట చేసుకున్న భూకంపాలలో టర్కీలో సంభవించిన భూకంపమే(Earthquake Turkey) అతి పెద్దది కావడం విశేషం.
ప్రజలు నిద్రలో ఉండగానే భూకంపం సంభవించింది. దీంతో చాలా మంది నిద్రలోనే శాశ్వతంగా భూమిలో కలిసి పోయారు. వారంతా ఊపిరి పీల్చుకునేందుకు సైతం టైం దొరకలేదు. అంతా చూస్తుండగానే భవనాలను నేలమట్టం చేసింది. సైప్రస్ ద్వీపం వరకు ప్రకంపనులను పంపింది. మొదట 53 మంది చని పోయినట్లు అధికారులు గుర్తించారు. కానీ రాను రాను భారీ భూకంపం దెబ్బకు 90 మందికి పైగా ఉన్నట్టు అంచనాకు వచ్చారు.
ఇదిలా ఉండా ఉత్తర సిరియాలోని ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 42 మంది మరణించినట్లు రాష్ట్ర మీడియా వెల్లడించింది. భారీ భూకంపం చోటు చేసుకోవడంతో వేలాది మంది భయంతో బయటకు వచ్చారు.
మరికొంది భూమిలో కూరుకు పోయారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామన 4.17 గంటలకు 17.9 కిలోమీటర్ల లోతులో భూకంపం(Earthquake Turkey) సంభవించింది. ఈ విషయాన్ని యుఎస్ ఏజెన్సీ వెల్లడించింది. టర్కీ ఏఎఫ్ఏడీ అత్యవసర సేవా కేంద్రం మొదటి భూకంప తీవ్రతను 7.4 గా పేర్కొంది.
Also Read : కాశ్మీర్ కోసం యత్నం ‘పర్వేజ్’ విఫలం