Malala Yousafzai : మహిళలు, యువతులు, బాలికల పట్ల హిజాబ్ పేరుతో ఆఫ్గనిస్తాన్ అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రపంచ మానవ హక్కుల కార్యకర్త, నోబెల్ ప్రైజ్ విన్నర్ మలాలా యూసఫ్ జాయ్(Malala Yousafzai).
చదువుకు దూరం చేయడం కూడా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. హిజాబ్ పేరు చెప్పి కఠినతరమైన కట్టుబాట్లుకు గురి చేయడం దారుణమన్నారు.
ఆఫ్గనిస్తాన్ లో మిలియన్ల మంది మహిళలు, బాలికల హక్కులను ఉల్లంఘించినందుకు తాలిబన్ ను బాధ్యులను చేసేందుకు సమిష్టి చర్య తీసుకోవాలని మలాలా యూసఫ్ జాయ్ ప్రపంచ నాయకులను కోరారు.
తాలిబన్లు కొత్తగా హిజాబ్ విధించడాన్ని ఆమె తప్పు పట్టారు. ప్రధానంగా మహిళలను పరదా ధరించమని బలవంతం చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఆఫ్గనిస్తాన్ లో మహిళలకు హిజాబ్ తప్పనిసరి చేస్తూ తాలిబన్ డిక్రీ జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు మలాలా. ఇది పూర్తిగా మహిళల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్లు ఆఫ్గనిస్తాన్ లోని అన్ని ప్రజా జీవితాల నుండి బాలికలు, మహిళలను చెరిపి వేయాలని కోరుకుంటున్నారు.
బాలికలను పాఠశాలల నుండి , మహిళలను పనికి దూరంగా ఉంచడం అత్యంత అమానవీయ చర్యగా ఆమె అభివర్ణించారు. మగ వాళ్లు ఉంటేనే బయటకు రావాలని ఆదేశించడాన్ని తప్పు పట్టారు మలాలా(Malala Yousafzai) .
తాలిబాన్లు తాము చేసిన వాగ్ధానాలను ఉల్లంఘిస్తున్నారు. మహిళలు, బాలికల పట్ల వారి ప్రవర్తన దారుణంగా ఉందన్నారు. ముస్లిం దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా ఆఫ్గనిస్తాన్ చర్యలను ఖండించాలన్నారు మలాల.
Also Read : ఎయిర్ హోస్టెస్ కంటతడి వైరల్