Malaria Vaccine: త్వరలో మార్కెట్ లోనికి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్
త్వరలో మార్కెట్ లోనికి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్
Malaria Vaccine : మలేరియా రహిత భారత్ ను సాధించేదిశగా అడుగులు పడుతున్నాయి. ప్రాణాంతక మలేరియాను రూపుమాపడానికి స్వదేశీ వ్యాక్సిన్‌ను (Malaria Vaccine) అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఐసీఎంఆర్, భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం (ఆర్‌ఎంఆర్‌సీబీబీ), జాతీయ మలేరియా పరిశోధన సంస్థ (ఎన్‌ఐఎంఆర్)… నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ-ఎన్‌ఐఐ) భాగస్వామ్యంతో అడ్‌ఫాల్సీవ్యాక్స్ అనే రీకాంబినెంట్ చిమెరిక్ మలేరియా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. అడ్‌ఫాల్సీవ్యాక్స్ అనేది.. మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం పరాన్నజీవిలోని రెండు క్లిష్ట దశలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న స్వదేశీ మలేరియా వ్యాక్సిన్. ఐసీఎంఆర్ అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ప్రీక్లినికల్ దశలో అద్భుత ఫలితాలు అందించిందని, ఇప్పటికే ఉన్న సింగిల్ స్టేజ్ వ్యాక్సిన్ల కంటే అడ్‌ఫాల్సీవ్యాక్స్‌తో మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని డేటా వెల్లడిస్తోంది.
Malaria Vaccine – సముద్రతీర గస్తీకి రోబోలు ! పుదుచ్చేరిలో ట్రయల్‌రన్ విజయవంతం !
సముద్రతీర గస్తీ విధుల్లో పోలీసులకు సాయంగా మొట్టమొదటిసారిగా రోబోలు పాల్గొననున్నాయి. పుదుచ్చేరి అసెంబ్లీ భవనం సమీపంలోని సముద్రతీరంలో ఆదివారం పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో రోబోలతో ట్రయల్‌రన్ నిర్వహించారు. సముద్రతీరంలో సేదతీరేందుకు వస్తున్న స్వదేశీ, విదేశీ పర్యాటకులకు మరింత భద్రత కల్పిస్తూ సుమారు 2 కిలోమీటర్ల మేర పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విధుల్లో పోలీసులకు సహకరించే విధంగా ఆధునిక సాంకేతికతతో రూపొందించిన రోబోల సేవలను వినియోగించుకోవాలని పుదుచ్చేరి పోలీసుశాఖ నిర్ణయించింది. దీనికోసం చెన్నైలోని ఓ ప్రైవేటు ఐటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రోబోలను తయారు చేయించారు. ఆ రోబోల పనితీరును తెలుసుకునేందుకు డీఐజీ సత్యసుందరం నేతృత్వంలో ఆదివారం నిర్వహించిన ట్రయల్‌రన్ విజయవంతమైంది. ఈ రోబోలలో పొందుపరిచిన ఆధునిక కెమెరాల ద్వారా సముద్రతీరంలో గస్తీ పనులను పర్యవేక్షిస్తారు.
Also Read : Minister Manikrao Kokate: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి ! మంత్రిపై విపక్ష పార్టీలు ఫైర్ !
