Joseph Manu James : డైరెక్ట‌ర్ జోసెఫ్ మ‌ను జేమ్స్ క‌న్నుమూత

మ‌ల‌యాళ చిత్ర సీమ‌లో మ‌రో విషాదం

Joseph Manu James : మ‌ల‌యాళ సినీ రంగంలో వ‌రుస‌గా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ప్ర‌ముఖ న‌టి మ‌ర‌ణించ‌గా ఇవాళ న‌టుడు, ద‌ర్శ‌కుడిగా పేరొందిన జోసెఫ్ మ‌ను జేమ్స్(Joseph Manu James) క‌న్నుమూశారు. ఆయ‌న కొంత కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. విచిత్రం ఏమిటంటే ఆయ‌న వ‌య‌స్సు కేవ‌లం 31 ఏళ్లు మాత్ర‌మే. న‌టుడిగా, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా, ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందారు.

ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నాన్సీ రాణి విడుద‌ల‌కు కొద్ది రోజుల ముందు క‌న్నుమూయ‌డంతో ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీలో విషాద వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. హెప‌టైటిస్ తో కొంత కాలం పాటు బాధ‌ప‌డుతున్నారు. న‌టుడు, ద‌ర్శ‌కుడే కాదు నిర్మాత కూడా.

నాన్సీ రాణిలో జోసెఫ్ మ‌ను జేమ్స్ తో క‌లిసి ప‌ని చేసిన అజు వ‌ర్గీస్ ఆయ‌న అకాల మ‌ర‌ణం గురించి తెలుసుకున్న త‌ర్వాత త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. అత్యంత సునిశిత‌మైన ప‌రిశీల‌నా శ‌క్తి, అద్భుత‌మైన ప్ర‌తిభ క‌లిగిన ద‌ర్శ‌కుడు అని ప్ర‌శంసించారు. ఇది ఊహించ లేద‌ని పేర్కొన్నారు. ఒక ర‌కంగా ఏం మాట్లాడాలో తెలియ‌డం లేదు. నీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు.

ఇక జోసెఫ్ మ‌ను జేమ్స్ తొలి చిత్రంలో న‌టించిన అహానా కృష్ణ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇలా జ‌ర‌గ‌కూడ‌దు జేమ్స్ స‌ర్ అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. దేవుడు ఇలా మా నుంచి దూరం చేస్తాడ‌ని అనుకోలేదంటూ పేర్కొంది. జోసెఫ్ మ‌ను జేమ్స్(Joseph Manu James) బాల న‌టుడిగా వినోద ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టాడు. ఆయ‌న మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ చిత్రాల‌లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాడు.

Also Read : త‌మిళ సినిమాకు వార్న‌ర్ ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!