Malkajgiri MLA : వక్ఫ్ బోర్డు పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి

ఇటీవల వక్ఫ్‌బోర్డు రిజిస్ట్రేషన్ల నిలిపివేత కోరుతూ నిషేధిత సర్వే నంబర్లను ప్రకటించింది...

Malkajgiri MLA : వక్ఫ్‌బోర్డు స్థలాన్నే కబ్జాల నుంచి కాపాడుకోలేని దుస్థితిలో వక్ఫ్‌బోర్డు పనిచేస్తోందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరెడ్డి(Malkajgiri MLA) ఆరోపించారు. కబ్జా చేసిన వారికి పోలీసులు వత్తాసు పలకడం వెనుక ప్రభుత్వ పెద్దలెవరున్నారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వక్ఫ్‌బోర్డు తీరు పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయం అన్నట్టుగా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.

Malkajgiri MLA Comment

మల్కాజిగిరిలో750 ఎకరాలు తమవే అన్న వక్ఫ్‌బోర్డు సీఈవో ప్రకటనతో పాటు ఆయా సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలంటూ చేసిన ప్రకటనతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటీవల వక్ఫ్‌బోర్డు రిజిస్ట్రేషన్ల నిలిపివేత కోరుతూ నిషేధిత సర్వే నంబర్లను ప్రకటించింది. అయితే, నిషేధిత జాబితాలో లేని 398, 399 సర్వే నంబర్లలో వివాదాస్పదంగా మారిన వక్ఫ్‌ భూములను సర్వే నిర్వహించి నిజాలు తేల్చాలని ఎమ్మెల్యే అన్నారు.

ప్రస్తుతంఅందులో కబ్జాలో ఉన్న వారికి వక్ఫ్‌ చట్టం 52ఏ ప్రకారం నోటీసులిచ్చి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాల్సి ఉండగా.. సదరు వక్ఫ్‌ అధికారులు ఎవరికి బయపడుతున్నారో తెలియడంలేదన్నారు. ఈ సర్వే నంబర్లలోని దాదాపు 20 ఎకరాల భూమిని కబ్జాచేసిన వారికి పోలీసులే సహకరించడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్‌బోర్డు సీఈవోకు తెలియకుండానే కబ్జాలు జరుగుతున్నాయా? స్థానిక వక్ఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ముతవల్లి) సహకారం కబ్జా చేసిన వారికి లేదా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నియోజకవర్గంలోని దాదాపు 70 వరకు కాలనీలు, బస్తీలు నిషేధిత జాబితా సర్వే నంబర్లలో ఉన్నాయని, ఇప్పటి వరకు ఎవరికి నోటీసులు ఇవ్వని అధికారులు ఇప్పుడే ఎందుకు నోటీసులంటూ భయపెడుతున్నారో అర్థం కావడంలేదన్నారు. కబ్జాకు పాల్పడిన వారిపై వక్ఫ్‌బోర్డు చట్టం 52ఏ ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Also Read : APPSC Group 2 : మరోసారి వాయిదా పడ్డ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు

Leave A Reply

Your Email Id will not be published!