Malla Reddy : మల్లారెడ్డిపై కేసు నమోదు
గులాబీ నేతల దాదాగిరి
Malla Reddy : హైదరాబాద్ – మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి షాక్ తగిలింది. పోలీసులు కేసు నమోదు చేశారు. శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరో వైపు ఇదే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అప్పులు తీసుకుని వడ్డీలు కట్టకుండా ఎగవేసినందుకు గాను ఆయనకు నోటీసు ఇచ్చింది స్టేట్ ఫైనాన్షియల్ సంస్థ.
Malla Reddy Got Case
ఇది పక్కన పెడితే తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) నిర్వాకం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని గులాబీ నేతలు గూండాగిరి నిర్వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ భూములను కబ్జా చేశారన్న విమర్శలు ఉన్నాయి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డిపై.
ఈసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీకి పవర్ కట్టబెట్టారు. ఇదిలా ఉండగా గంగారామ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఎన్నికలకు ముందు గిరిజనులకు చెందిన భూములను బలవంతంగా మల్లారెడ్డి తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ వాపోయారు. ఇదే సమయంలో శామీర్ పేట తహశిల్దార్ పై కూడా కేసు నమోదు చేసినట్లు చెప్పారు ఖాకీలు.
Also Read : KTR Slams : కాంగ్రెస్ శ్వేత పత్రం కేటీఆర్ ఆగ్రహం