Mallikarjun Kharge : మాజీ ప్రధాని కుమారుడి పై నోరు జారిన ఖర్గే
దీంతో, ఖర్గే ఆగ్రహంతో ఊగిపోయారు...
Mallikarjun Kharge : కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే బుధవారం రాజ్యసభలో సంయమనం కోల్పోయారు. తాను ప్రసంగిస్తున్న సమయంలో అడ్డుపడిన బీజేపీ ఎంపీని ఉద్దేశించి.. ‘‘మీ నాన్న, నేను కలిసి పనిచేశాం. చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నా. ఏం మాట్లాడుతున్నావ్. నోర్మూసుకొని కూర్చో’’ అంటూ నోరు పారేసుకున్నారు. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఖర్గే రూపాయి పతనాన్ని ప్రస్తావించారు.
Mallikarjun Kharge Comments
ఈ సమయంలోనే బీజేపీ ఎంపీ, మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ అడ్డుపడ్డారు. దీంతో, ఖర్గే ఆగ్రహంతో ఊగిపోయారు. సభలో గందరగోళం నెలకొనడంతో, రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ కలుగజేసుకొన్నారు. చంద్రశేఖర్ ప్రస్తావనను ఉపసంహరించుకోవాలని ఖర్గేను కోరారు. చంద్రశేఖర్ ఎంతో ప్రజాదరణ కలిగిన సోషలిస్టు నేత అని, ఆయన గురించి అమర్యాదగా మాట్లాడటం సరికాదని అన్నారు. నీరజ్ శేఖర్ 2019లో బీజేపీలో చేరారు. అంతకుముందు సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నారు.
Also Read : Pakistan PM : కాశ్మీర్ సహా అన్ని సమస్యలపై చర్చిద్దామంటున్న పాక్ ప్రధాని