Mallikarjun Kharge : ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేయాలన్నదే కేంద్రం కుట్ర
అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ రికార్డులు అందుబాటులో ఉంచుతారు...
Mallikarjun Kharge : ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో భారత ఎన్నికల సంఘం మార్పులు చేయడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) తప్పుపట్టారు. ఎన్నికల సంఘం సమగ్రతను దెబ్బతీసేందుకు కేంద్రం పన్నిన కుట్రలో ఇదొక భాగమని ఆరోపించారు. ఎన్నికల సంఘం సిఫారసు మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని 93(2)(ఏ) నిబంధనను కేంద్ర న్యాయశాఖ ఇటీవల సవరించింది. ఈ నిబంధన ప్రకారం ఎన్నికలకు సంబధించి పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ కెమెరాల తనిఖీపై నిషేధం ఉంటుంది. అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ రికార్డులు అందుబాటులో ఉంచుతారు. తనిఖీ చేయడానికి మాత్రం అనుమతి ఉండదు.
Mallikarjun Kharge Comment
ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనలో మార్పులు చేయడం ఒక క్రమపద్ధతిలో ఎన్నికల సంఘాన్ని నిర్వీర్వం చేసేందుకు కేంద్రం పన్నిన కుట్రలో భాగమని ఖర్గే సామాజిక మాధ్యం ‘ఎక్స్’లో ఘాటుగా విమర్శించారు. ఎన్నికల సంఘాన్ని నిర్వీర్వం చేసేందుకు గతంలో ఎన్నికల కమిషనర్లను నియమించే ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని కేంద్రం తొలగించిందని, ఇప్పుడు ఎలక్ట్రానిక్ సమాచారానికి అడ్డుకోడ కట్టారని అన్నారు. ఓటర్ల పేర్లు తొలగింపు, ఈవీఎంలలో పారదర్శకత లోపించడం వంటి అక్రమాలపై కాంగ్రెస్ పలుసార్లు ఫిర్యాదు చేసినా ఈసీ స్పందించలేదన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కుట్రలు బయటకు రాకుండా పోలింగ్ సిసీటీవీ ఫుటేజ్‌ను, అభ్యర్థుల వీడియో రికార్డులను తొలగించకుండా నిషేధం విధించారని అన్నారు. ఈసీఐ సమగ్రతను కోల్పోతోందనడానికి, రాజ్యాంగం, ప్రజస్వామ్యంపై మోదీ ప్రభుత్వం దాడికి పాల్పడుతోందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఈ దాడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని ఖర్గే స్పష్టం చేశారు.
Also Read : Modi Kuwait Honor : ప్రధాని మోదీకి ‘గార్డ్ ఆఫ్ హానర్’ తో స్వాగతం పలికిన కువైట్ రాజు