Mallikarjun Kharge : 2010లోనే మహిళా బిల్లు ఆమోదం
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge : న్యూఢిల్లీ – కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge). 2010లోనే తాము మహిళా బిల్లును ప్రవేశ పెట్టామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కానీ ఇప్పుడు మోదీ పనిగట్టుకుని తీసుకు రావడం వెనుక రాజకీయ ప్రయోజనం దాగి ఉందని ఆరోపించారు.
Mallikarjun Kharge Comments on PM Modi
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. దేశంలో మొదటిసారిగా మహిళా బిల్లును తీసుకు రావాలని ప్రయత్నం చేసింది, దానిని రూపొందించింది తామేనని స్పష్టం చేశారు. కానీ దానిని కూడా తన స్వంత ప్రచారానికి మోదీ ప్రయ్నతించడం దారుణమన్నారు ఏఐసీసీ చీఫ్.
ఇది ఇప్పట్లో అమలు అయ్యే పరిస్థితి లేదన్నారు. ఎందుకంటే దేశంలో జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతనే మహిళా బిల్లు అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే తిరిగి మహిళా బిల్లును ప్రవేశ పెట్టడం అవివేకం తప్ప మరొకటి కాదని మండిపడ్డారు మల్లికార్జున్ ఖర్గే.
రాజ్యసభలో మహిళా బిల్లుపై తాను మాట్లాడుతున్న సమయంలో కావాలని బీజేపీ మంత్రులు, ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ ధ్వజమెత్తారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని నిలదీశారు ప్రధాని మోదీని. దేశ ప్రజలు మోదీ చేస్తున్న మోసాన్ని గ్రహిస్తున్నారని స్పష్టం చేశారు.
Also Read : Sanju Samson : సంజూ శాంసన్ కు నో ఛాన్స్
