Mallikarjun Kharge : మోదీ వ్యాఖ్యలను ఘాటుగా తిప్పికొట్టిన ఖర్గే

అందరూ కలిసికట్టుగా నిలిస్తే దేశాన్ని విభజించాలనే తమ ఎజెండా విఫలమవుతుందనే అభిప్రాయం కాంగ్రెస్‌లో ఉందన్నారు...

Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీని తరచు ‘అర్బన్ నక్సల్’ పార్టీగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శిస్తుండటంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనకు ఇది అలవాటుగా మారిందని, బీజేపీ ‘టెర్రరిస్టుల’ పార్టీ అని కౌంటర్ ఇచ్చారు. ” మోదీ ప్రతిసారి కాంగ్రెస్ పార్టీపై అర్బన్ నక్సల్ పార్టీ అంటూ ముద్ర వేస్తున్నారు. ఇది ఆయనకు అలవాటుగా మారింది. మరి ఆయన పార్టీ మాటేమిటి? బీజేపీ టెర్రరిస్టుల పార్టీ. కొట్టిచంపడాలు ఆ పార్టీ చేస్తుంటుంది. కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేసే హక్కు ఆయనకు లేదు” అని ఖర్గే అన్నారు.

Mallikarjun Kharge Slams..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో గత ఆక్టోబర్ 5న విదర్భలో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. అర్బన్ నక్సల్స్‌కు చెందిన గ్రూప్ కాంగ్రెస్‌ను కంట్రోల్ చేస్తోందని, ఆ పార్టీ ప్రమాదకర ఎజెండాను కలిసికట్టుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా నిలిస్తే దేశాన్ని విభజించాలనే తమ ఎజెండా విఫలమవుతుందనే అభిప్రాయం కాంగ్రెస్‌లో ఉందన్నారు. దళితులు దళితులుగా, పేదలు పేదలుగానే ఉండిపోవాలని కాంగ్రెస్ కోరుకుంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీని అర్బున్ నక్సల్స్ నడుపుతున్నారని, దేశాన్ని విభజించాలని వారు కోరుకుంటున్నారని, అందుకే ప్రజలను విడగొట్టాలని అనుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ కుట్రలను సమష్టిగా తిప్పికొట్టేందుకు ఇదే తగిన తరుణమని చెప్పారు. అక్టోబర్ 9న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయానంతరం కూడా మహారాష్ట్రలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ మోదీ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో బీజేపీని గెలిపించడం ద్వారా కాంగ్రెస్, అర్బన్ నక్సల్స్ విద్వేషపూరిత కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు.

Also Read : Minister Ponguleti : ఆయిల్ ఫార్మ్ రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు..పాల్గొన్న మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!