Mamata Banerjee : ఆఫ‌ర్ ఇచ్చినా వ‌ద్దాన‌న్న దీదీ

స్పైవేర్ పై సంచ‌ల‌న కామెంట్స్

Mamata Banerjee : నిన్న గేమ్ ఇంకా అయి పోలేద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేసిన టీఎంసీ చీఫ్, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee)ఇవాళ మ‌రో బాంబు పేల్చారు. ఇప్ప‌టికే స్పైవేర్ సంస్థ వ్య‌వ‌హారం దేశాన్ని ప‌ట్టి కుదిపేసింది.

ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు విప‌క్షాల‌న్నీ మోదీ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాయి. త‌మ‌కు తెలియ‌కుండా త‌మ‌పై స్పైవేర్ ప‌ని చేస్తోందంటూ, త‌మ డేటాకు ముప్పు వాటిల్లిందంటూ ఆరోపించారు.

పార్ల‌మెంట్ సాక్షిగా నిల‌దీశారు. కానీ కేంద్రం దానిపై స్పందించ లేదు. కోర్టులో ఉందంటూ త‌ప్పించుకుంది. త‌మ‌కు స్పైవేర్ పెట్టాల్సిన ప‌ని లేదంటూ ఎద్దేవా చేసింది.

ఇదంతా రాజ‌కీయం త‌ప్ప మ‌రొక‌టి కాదంటూ పేర్కొంది. ఈ త‌రుణంలో బెంగాల్ సీఎం (Mamata Banerjee)ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇప్పుడు మ‌రోసారి చ‌ర్చ‌కు దారితీసింది స్పైవేర్ వ్య‌వ‌హారం. ఇజ్రాయెల్ భ‌ద్ర‌తా సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ త‌న‌తో కూడా సంప్ర‌దింపులు జ‌రిపింద‌ని, ఇందుకు గాను రూ. 25 కోట్లు అడిగారంటూ బాంబు పేల్చింది.

నాలుగు సంవ‌త్స‌రాల కింద‌ట త‌మ రాష్ట్ర పోలీస్ డిపార్ట్ మెంట్ల‌కు ఇచ్చేందుకు వ‌చ్చారంటూ వెల్ల‌డించింది. దానిని కొనుగోలు చేసిన‌ట్ల‌యితే రాజ‌కీయంగా తాను మోసం చేసిన‌ట్ల‌వుతుంద‌ని భావించాన‌ని తెలిపింది మమ‌తా బెన‌ర్జీ.

తాను సున్నితంగా ఆ సంస్థ ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించాన‌ని వెల్ల‌డించింది. ప‌నిలో ప‌నిగా దీదీ మ‌రోసారి స్పై వేర్ వ్య‌వ‌హారంపై విచార‌ణ‌కు ఆదేశించాల‌ని డిమాండ్ చేశారు.

Also Read : యోగి కేబినెట్ లో కొలువు తీరేదెవ్వ‌రో

Leave A Reply

Your Email Id will not be published!