Mamata Banerjee : బెంగాల్ లో యూనివర్శిటీలకు సీఎం సుప్రీం
అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం ..గవర్నర్ కు షాక్
Mamata Banerjee : పశ్చి బెంగాల్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని యూనివర్శిటీలకు గౌరవ వీసీగా ఇక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉండనున్నారు. గతంలో గవర్నర్ వీసీగా కొనసాగే సంప్రదాయం ఉండేది.
ఎప్పుడైతే గవర్నర్ ధన్ కర్ కొలువు తీరారో ఆనాటి నుంచి సీఎం వర్సెస్ గవర్నర్ గా మారింది. దీనికి చెక్ పెడుతూ ఏకంగా అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టారు సీఎం. భారతీయ జనతా పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
వ్యతిరేకంగా 40 ఓట్లు పోల్ కాగా అనుకూలంగా 182 ఓట్లు వచ్చాయి. దీంతో సీఎంకు సర్వాధికారాలు కట్ట బెడుతూ బిల్లు ఆమోదించింది. ఇక నుంచి ఆయా యూనివర్శిటీల పాలనా నిర్వహణ అంతా సీఎం చేతుల్లో ఉంటుంది.
కింది స్థాయి సిబ్బంది నుంచి వీసీ ఎంపిక దాకా అంతా మొత్తం మమతా బెనర్జీ(Mamata Banerjee) కనుసన్నలలోనే జరుగుతుంది. వీసీలను ఆమెనే ఎంపిక చేస్తారు. ఇక నుంచి గవర్నర్ అన్న పదం ఉండదు. ఎలాంటి జోక్యం చేసుకునేందుకు వీలుండదు.
పశ్చిమ బెంగాల్ విశ్వ విద్యాలయ చట్టాల (సవరణ ) బిల్లు 2022ను సభలో ప్రవేశ పెట్టారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బ్రత్యా బసు మాట్లాడుతూ సీఎం చాన్స్ లర్ గా బాధ్యతలు స్వీకరించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు.
ప్రధాన మంత్రి కేంద్రీయ విశ్వ విద్యాలయానికి చాన్సలర్ గా ఉంటే రాష్ట్ర విశ్వ విద్యాలయాలకు ఛాన్సలర్ గా ఎందుకు ఉండ కూడదని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ప్రోటోకాల్ ను పదే పదే ఉల్లంఘించారు.
Also Read : దీదీ ఆహ్వానం ఉద్దవ్ ఠాక్రే దూరం