Mamata Banerjee: అమ్మాయిలు-అబ్బాయిలు మాట్లాడుకోవడం వల్లే.. అత్యాచారాలపై పాత వ్యాఖ్యలు తాజాగా వైరల్
అమ్మాయిలు-అబ్బాయిలు మాట్లాడుకోవడం వల్లే.. అత్యాచారాలపై పాత వ్యాఖ్యలు తాజాగా వైరల్
Mamata Banerjee: అమ్మాయిలు అబ్బాయిలు యథేచ్ఛగా మాట్లాడుకోవడం వల్లే అత్యాచారాలు పెరిగిపోతున్నాయని మమతా బెనర్జీ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి.
జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలకు దిగారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల వేళ అత్యాచారాలపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తాజాగా వైరల్గా మారాయి. అమ్మాయిలు, అబ్బాయిలు యథేచ్ఛగా మాట్లాడుకోవడం వల్లే రేప్ కేసులు పెరుగుతున్నాయంటూ నాడు ఆమె వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Mamata Banerjee Comment
2012లో కోల్కతాలోని పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో ఓ యువతి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి గురైంది. ఇది అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై నాడు దీదీ స్పందిస్తూ.. ‘‘ఈ కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు స్వేచ్ఛగా మాట్లాడుకోవడం పెరుగుతోంది. గతంలో అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు చేయి పట్టుకుని కన్పిస్తే వారిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించేవారు. తల్లిదండ్రులు వారిని మందలించి సరిదిద్దేవారు. కానీ ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ మార్కెట్ మాదిరిగా యువతకు అవకాశాలు ఉంటున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.
Also Read : Minister Nimmala : వైసీపీ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి నిమ్మల