Mamata Banerjee BJP Suvendu : మన్నించండి సువేందును క్షమించండి
ప్రతిపక్ష నాయకుడి తీరు దారుణం
Mamata Banerjee BJP Suvendu : భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీరుపై నిప్పులు చెరిగారు సీఎం మమతా బెనర్జీ. ఆయన ప్రవర్తిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. ఇక్కడే కాదు దేశ వ్యాప్తంగా ఇలాగే బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం. ఆయన స్పీకర్ పట్ల వ్యవహరించిన తీరు పట్ల తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
ఇదిలా ఉండగా స్పీకర్ పై చేసిన వ్యాఖ్యల తర్వాత తన తరపున క్షమాపణలు చెప్పారు సీఎం. ఆమె జోక్యంతో బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఇవాళ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ నుంచి తప్పించు కున్నారు. కాగా సీఎం తన సహాయకుడిగా మారిన రాజకీయ ప్రత్యర్థి ప్రవర్తనను ఖండిస్తూ ఎలాంటి వ్యాఖ్యలు చేయక పోవడం విశేషం.
అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee BJP Suvendu). ఆమె ఎత్తి పొడుస్తూనే మరో వైపు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పక్ష నాయకుడు సువేందు అధికారి సిగ్గుచేటుగా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడూ ఇలాగే ఉంటారు. ఎక్కడైనా ఇలాంటి భాషనే వాడుతున్నారు. మాపై కూడా ..
ఆయన తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. దయచేసి ఆయనను క్షమించండి. వారిని కూడా క్షమించమని కోరుతున్నానని అన్నారు సీఎం మమతా బెనర్జీ. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై సీఎం, ప్రతిపక్ష నాయకుడి ప్రతిస్పందనలు కలకలం రేపాయి.
నిధుల దుర్వినియోగం , సీనియర్ బ్యూరోక్రాట్ లు, పోలీసు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు సువేందు అధికారి. ఆయన మాట్లాడిన మాటలను రికార్డు చేసేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆయన సహనాన్ని కోల్పోయాడు. బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.
Also Read : రాహుల్ విమానం దిగేందుకు అడ్డంకి