Mamata Banerjee : ఈద్ కి వచ్చిన కార్మికులు ఓటు వెయ్యకుండా వెల్లలొద్దంటూ వ్యాఖ్యలు

యుసిసి ప్రవేశపెట్టినప్పుడు ఏమి జరిగిందో మీకు తెలుసా?

Mamata Banerjee : ఈద్ వేడుకల కోసం బెంగాల్‌కు వచ్చిన వలస కార్మికులు ఓటు వేయకుండా తిరిగి వెళ్లోద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ముర్షిదాబాద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో సిఎం మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే, ఓటు వేయని వాళ్ళ ఆధార్ కార్డులు మరియు పౌరసత్వాన్ని తొలగిస్తారని సిఎం అన్నారు.

Mamata Banerjee Comment

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ తన ప్రచార ర్యాలీలలో ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. సీఏఏను అస్సాంలో అమలు చేయరాదని, రాష్ట్రంలో అమలు చేస్తే చాలా మంది చనిపోతారని అన్నారు. “ఇప్పుడు వారు (బిజెపి) ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) గురించి కూడా మాట్లాడుతున్నారు. యుసిసి ప్రవేశపెట్టినప్పుడు ఏమి జరిగిందో మీకు తెలుసా? మీరు మీ గుర్తింపును కోల్పోతారు’ అని మమతా బెనర్జీ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌ బెహార్‌, జల్‌పైగురి (ఎస్‌సీ), అలీపురుద్దూర్‌ నియోజకవర్గాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల నేపథ్యంలో సీఎం ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Also Read : Amit Shah : ఎలక్టోరల్ బాండ్ల విరాళాలను కాంగ్రెస్ దోచుకుంది

Leave A Reply

Your Email Id will not be published!