Manda Krishnamadiga : కాంగ్రెస్ మాదిగలకు వెన్నుపోటు పొడిచింది

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు...

Manda Krishnamadiga : కాంగ్రెస్ పార్టీ మాదిగ సామాజికవర్గానికి వెన్నుపోటు పొడిచిందని, రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీ మాదిగలు, బీసీలను దూరం చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ తర్వాతే ఖాళీగా ఉన్న స్థానాలను చేపట్టాలని, రిజర్వేషన్లు పటిష్టం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 7న వరంగల్‌లో మాదిగల ఆత్మగౌరవ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.

Manda Krishnamadiga Comment

తమ మద్దతు వల్లే బీజేపీ ఓట్ల శాతం 21 శాతానికి పెరిగిందని, బీజేపీ ఓటు బ్యాంకు వృద్ధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా రేవంత్ రెడ్డి కారణమని చెప్పారు. ఒక్క మాదిగ కౌన్సిలర్ కూడా లేకుండా తెలంగాణ రాష్ట్రం చేసిన రేవంత్ రెడ్డికి గుణపాఠం తప్పదన్నారు. ఎస్సీ, సీఅండ్‌బీ, బీసీల్లో రిజర్వేషన్లు పెంచే వరకు నియామకాలు చేపట్టవద్దని, మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, బి విజయ్ మాదిగ, నరసింహ మాదిగ, లక్ష్మణ్ మాదిగ పాల్గొన్నారు.

Also Read : Mudragada Padmanabham: ముద్రగడ పేరు మార్పు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల !

Leave A Reply

Your Email Id will not be published!