#MandeepPunia : ఖాకీల దాష్టీకం ఎక్కు పెట్టిన కలం – మన్ దీప్ పునియా
కలాలు, కెమెరాలను తూటాలు పేల్చలేవు
Mandeep Punia :
ఈ దేశాన్ని కొన్ని శక్తులు ఏలుతున్నవి. వాటి ప్రయోజనం తాము మాత్రమే బతకాలని కోరుకుంటాయి.
కానీ సమస్త ప్రపంచం ప్రతి ఒక్కరూ బతకాలని కోరుకుంటుంది. కొంత మంది ఎప్పటికీ బలపడాలని, తామే ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటారు.
కానీ వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పది. దాని ముందు ఏ శక్తి ఆపలేదు. ఇది నేను చెప్పిన కథ కాదు.
చరిత్ర చెప్పిన సత్యం. వాస్తవం. దాని నుంచి బయట పడేందుకు ప్రభుత్వం అనే ముసుగు. చట్టం అనే ఒక వెసలుబాటు.
ఇవాళ నేను అరెస్ట్ అయి..బెయిల్ పై విడుదల కావచ్చు. రేపు ఇంకొకరు జైలు ఊచలు లెక్క బెట్టాల్సి ఉంటుంది.
దీనికి మనమంతా సిద్ధమై ఉండాలి. దేనినైనా ఎదుర్కొనేందుకు. నా వృత్తి పట్ల నేను సక్రమంగానే రిపోర్టింగ్ చేశా.
కానీ నన్ను దేశ ద్రోహుని కంటే హీనంగా చూసింది ఖాకీ వ్యవస్థ. వాళ్లకు నేను ఓ టెర్రరిస్టుగా కనిపించా. నన్ను చంపాలనుకుంటే ఇవాళ కాక పోయినా రేపైనా చంపగలరు. ఆ శక్తి వారికుంది. కాదనను.
కానీ నాలాంటి వాళ్లు ఎందరో ఈ దేశం కోసం..
అన్నం పెట్టే రైతుల కోసం వారు పడుతున్న ఆవేదనను ప్రపంచానికి తెలియ చెప్పేందుకు సిద్ధమై ఉన్నారు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించే స్థితి దాటి పోయింది.
ఇవాళ సాయుధ దళాలు మోహరించాయి. ఇనుప చువ్వలు, బారికేడ్లు వెలిశాయి.
కానీ సమస్త రైతాంగం ఒక్కటైతే జైళ్లు సరిపోతాయా. అది ఆలోచించాలి పాలకులు.
వ్యవస్థ ఎప్పుడూ ఒకే రీతిన ఉంటే మీరు కుర్చీల మీద కూర్చునే వాళ్లు కారు.
ఏదో ఒక రోజు వస్తుంది. ఆరోజు వారిదవుతుంది. నా లాంటి వాళ్లు కలాలు ఝులిపిస్తారు.
కెమెరాలో బంధిస్తూనే ఉంటారు. ఎందరిని ఆపగలరు. ఇంకెందరిని తొక్కి పెట్టగలరంటూ జైలు నుంచి విడుదలైన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మన్ దీప్ పునియా (Mandeep Punia )చెప్పిన మాటలు.
ప్రతి జర్నలిస్టు ఇతడి మాటలను వినాలి. ఆయన రిపోర్టింగ్ కోసం పడుతున్న కష్టాన్ని చూడాలి. తన పట్ల , నాతోటి రైతుల పట్ల ఖాకీలు అమానుషంగా ప్రవర్తించారు. చెప్పలేని రీతిలో వారు దాడులు చేశారు. అన్నదాతలు కాళ్లు, పాదాలు అన్నీ కంది పోయాయి.
వాళ్లను చూసి చలించా. చేతుల మీద రాసుకున్నా. నా దగ్గర లాక్కున్నారు. ఇక నా కలం . కెమెరా వారి గురించి కథలుగా రాస్తా. ఇంక నన్నాపెదెవ్వరు అంటున్నారు. మన్ దీప్ పునియా.
No comment allowed please